పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 77   Prev  /  Next

(తరగతి క్రమము 49)
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధామాన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 226
మరణశయ్యపైనున్న భీష్ముడు తనచెంతకు వచ్చిన శ్రీకృష్ణుని చూసి ఈ విధముగా ప్రార్థించెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

तमिममहमजं शरीरभाजां हृदि हृदि धिष्ठितमात्मकल्पितानाम्।
प्रतिदृशमिव नैकधार्कमेकं समधिगतोऽस्मि विधूतभेदमोहः ॥

తమిమమహమజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానాం ।
ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోऽస్మి విధూతభేదమోహః ॥
వ్యాఖ్య
ఒక సూర్యుండు = ఒకే సూర్యుడు;
సమస్తజీవులకుఁ = అన్ని జీవులకు;
తా నొక్కొక్కఁడై తోఁచు పోలిక = తను ఒక్కొక్కడుగా కనిపించు విధముగా;
ఏ దేవుఁడు = ఏ దేవుడు;
సర్వకాలము = అన్ని కాలములలో;
మహాలీలన్ = (తన) మహా లీలతో;
నిజ - ఉత్పన్న జన్య కదంబంబుల = (తన) స్వభావముతో పుట్టినట్టి జీవుల;
హృత్సరోరుహములన్ = హృదయ పద్మములలో;
నానావిధామాన రూపకుఁడై = అనేక రూపములలో;
ఒప్పుచునుండు = తగినరీతిలో (స్థ్రిరమై) ఉండునో;
అట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై = అటువండి హరిని నేను పవిత్రతతో ప్రార్ధించెదను.
సాధన
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక
నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల
హృత్సరోరుహములన్ నానావిధామాన రూ
పకుఁడై యొప్పుచునుండు
నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
oka sUryuMDu samastajIvulaku@M dA nokkokka@MDai tO@Mcu pO
lika
nE dEvu@MDu sarvakAlamu mahAlIlan nijOtpanna ja
nya kadaMbaMbula
hRtsarOruhamulan nAnAvidhAmAna rU
paku@MDai yoppucunuMDu
naTTi hari nE@M brArthiMtu SudduMDanai.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)