పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 26   Prev  /  Next

తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
దన చరిత్ర నేను దవిలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 130
ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

प्रगायतः स्ववीर्याणि तीर्थपादः प्रियश्रवाः ।
आहूत इव मे शीघ्रं दर्शनं याति चेतसि ॥

ప్రగాయతః స్వవీర్యాణి తీర్థపాదః ప్రియశ్రవాః ।
ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి ॥
వ్యాఖ్య
నారదుడు వ్యాసునితో పలికెను:

తీర్థపాదుఁడయిన = పవిత్రమైన;
దేవుండు విష్ణుండు = భగవంతుడైన విష్ణువు;
తన చరిత్ర నేను దవిలి పాడఁ = ఆయన చరిత్రను నేను ప్రేమతో పాడగా;
జీరఁబడ్డవాని చెలువున = ఎలుగెత్తి పిలువబడిన వాని విధముగా;
ఏతెంచి ఘనుఁడు = ఆ గొప్పవాడు వచ్చి;
నా మనమునఁ = నా మనస్సునందు;
కానవచ్చు = అగుపించును.

నారదుడు తన పూర్వజన్మ చరిత్రను చెప్పిన తరువాత ఈ మాటలను వ్యాసునితో పలికెను. భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు - వేలకొలది మనుషులలో ఏ ఒక్కడో తనను తెలిసికొనుటకు ప్రయత్నించునని, అట్లు ప్రయత్నించిన వారిలో ఒక్కడు మాత్రమే తనను తెలిసికొనగలడని చెప్పెను (7.3). అటువంటి వారిలో నారదుడు ఒకడు. తను స్వయంగా భగవంతుని చూసితినని చెప్పినటువంటి వాడు నారదుడు. కనుక నారదునియొక్క భక్తి ఎంత గాఢమయినదో తెలియుచున్నది. అటువంటి భక్తియున్నప్పుడు మనిషికి ఎటువంటి గుణములు కలుగునో మనకు భగవద్గీతలోని పండ్రెండవ (12 వ) అధ్యాయము (భక్తియోగము) ద్వారా మనకు తెలియుచున్నది. అందులో ముఖ్యముగా 13 నుండి 19వ శ్లోకము వరకు మహాభక్తుల లక్షణములు చెప్పబడియున్నవి. అవి:

(1) అద్వేష్టా సర్వభూతానాం, (2) మైత్రః, (3) కరుణ; (4) నిర్మమః, (5) నిరహంకారః, (6) సమదుఃఖసుఖః, (7) క్షమీ; (8) సంతుష్ట సతతం, (9) యోగీ, (10) దృఢనిశ్చయః, (11) మయ్యర్పితమనోబుద్దిః; (12) న ఉద్విజతే లోకః, (13) లోకాన్నోద్విజతః, (14) హర్ష-అమర్ష-భయ-ఉద్వేగ ముక్తః; (15) అనపేక్షః, (16) శుచిః, (17) దక్ష, (18) ఉదాసీనః, (19) గతవ్యథః; (20) సర్వారంభపరిత్యాగీ, (21) నహృష్యతి (22) నద్వేష్టి (23) నశోచతి (24) నకాంక్షతి; (25) శుభ అశుభ పరిత్యాగీ; (26) సమశ్శత్రౌచ మిత్రేచ, (27) సమ మానావమానయః; (28) శీతోష్ణ సుఖదుఃఖేషు సమః, (29) సంగవివర్జితః; (30) తుల్య నిందాస్తుతిః, (31) మౌనీ, (32) సంతుష్టః యేన కేనచిత్; (33) అనికేతః, (34) స్థిరమతిః.
సాధన
తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
దన చరిత్ర నేను దవిలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
ఘనుఁడు
నా మనమునఁ గానవచ్చు.
tIrthapAdu@MDayina dEvuMDu vishNuMDu
dana caritra nEnu davili pADa@M
jIra@MbaDDavAni celuvuna nEteMci
ghanu@MDu
nA manamuna@M gAnavaccu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)