పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 24   Prev  /  Next

(తరగతి క్రమము 125)
ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత
మగు హృషీకేశుసన్నిధి నా విధమునఁ
గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు
ఛందస్సు (Meter): తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 149
ప్రహ్లాదుడు తన తండ్రియైన హిరణ్యకశిపునితో ఇట్లు పలికెను:

यथा भ्रम्यत्ययो ब्रह्मन् स्वयमाकर्षसन्निधौ ।
तथा मे भिद्यते चेतश्चक्रपाणेर्यदृच्छया ॥

యథా భ్రమ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్షసన్నిధౌ ।
తథా మే భిధ్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్ఛయా ॥
వ్యాఖ్య
ఇనుము = ఇనుము;
అయస్కాంత సన్నిధిన్ = అయస్కాంతమునకు చేరువలో ఉన్నప్పుడు;
ఎట్లు భ్రాంత మగు = ఏవిధముగా దానిచుట్టు తిరుగుతూ ఉండునో (లేదా దాని మాయలో పడి పోయి, వశమై ఉండునో)
హృషీకేశుసన్నిధి = ఇంద్రియములకు రాజైన ఆ భగవంతుని కి దగ్గరగా చేరిన (నా మనసు);
నా విధమునఁ = ఆ విధముగా (అంత సహజంగా, అంత బలంగా);
కరఁగుచున్నది = నా వశముగాకుండ;
దైవయోగమునఁ జేసి = భగవంతుని దగ్గరకు చేరి;
బ్రాహ్మణోత్తమ! = ఓ బ్రాహ్మణోత్తమ!
చిత్తంబు భ్రాంత మగుచు = నా మనసు (ఆ భగవంతుని చుట్టు) తిరుచున్నది.
సాధన
ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత
మగు
హృషీకేశుసన్నిధి నా విధమునఁ
గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు
inu mayaskAMta sannidhi neTlu bhrAMta
magu
hRshIkESusannidhi nA vidhamuna@M
gara@Mgucunnadi daivayOgamuna@M jEsi
brAhmaNOttama! cittaMbu bhrAMta magucu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)