పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 157   Prev  /  Next

(తరగతి క్రమము 121)
సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞానకారణంబు
కలవంటి, దింతియ కాని నిక్కము గాదు, సర్వార్థములు మనస్సంభవములు
స్వప్నజాగరములు సమములు, గుణశూన్యుఁడగు పరమునికి గుణాశ్రయమున
భవవినాశంబులు పాటిల్లి నట్లుండుఁ బట్టి చూచిన లేవు బాలురార!

కడఁగి త్రిగుణాత్మకములైన కర్మములకు
జనకమై వచ్చు నజ్ఞానసముదయమును
ఘనతర జ్ఞానవహ్నిచేఁగాల్చి పుచ్చి
కర్మవిరహితులై హరిఁగనుట మేలు
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 238
ప్రహ్లాదుడు నారదుడు చేసిన ఆత్మ బోధను తెలిపి, తన తోటి బాలురతో ఈవిధముగా పలికెను. ఈ పద్యము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

एतद्द्वारो हि संसारो गुणकर्मनिबन्धनः।
अज्ञानमूलोऽपार्थोऽपि पुंसः स्वप्न इवार्प्यते॥
तस्माद्भवद्भिः कर्तव्यं कर्मणां त्रिगुणात्मनाम्।
बीजनिर्हरणं योगः प्रवाहोपरमो धियः॥

ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః
అజ్ఞానమూలోऽపార్థోऽపి పుంసః స్వప్న ఇవార్ప్యతే
తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః
వ్యాఖ్య
సంసార మిది = ఈ భౌతిక ప్రపంచము;
బుద్ధిసాధ్యము = బుద్ధి వలన ఏర్పడినది;
గుణకర్మ గణబద్ధము = త్రిగుణములచే జనించిన కర్మ గణములచే బద్ధమైనది;

అజ్ఞానకారణంబు = అజ్ఞానమే దీనికి మూలము;
కలవంటిది = [ఈ భౌతిక ప్రపంచము] కల వంటిది;
ఇంతియ కాని = అంతే కాని;
నిక్కము గాదు = నిజమైనది కాదు;

సర్వార్థములు = [ఈ భౌతిక ప్రపంచములోని] అన్ని విషయములు;
మనస్సంభవములు = మనస్సు నుండి పుట్టినవే;
స్వప్నజాగరములు సమములు = నిద్రావస్థ, మెలకువ - ఈ రెంటికి భేదము లేదు;

గుణశూన్యుఁడగు పరమునికి = ఎట్టి గుణములు లేనట్టి భగవంతునికి;
గుణాశ్రయమున = [ఈ శరీరమునందు] గుణములు ఆశ్రయించుట వలన;
భవవినాశంబులు = పుట్టుక, మరణము
పాటిల్లి నట్లుండుఁ = కలిగినట్లుండును;
పట్టి చూచిన లేవు = [కాని] పరిశీలించి చూచినచో [ఈ జనన మరణములు] లేవు;
బాలురార! = ఓ బాలురార!

కడఁగి = [కనుక మానవుడు] ప్రయత్నము చేసి;
త్రిగుణాత్మకములైన కర్మములకు = త్రిగుణములచే ఏర్పడిన కర్మలకు;
జనకమై వచ్చు నజ్ఞానసముదయమును = కారణమైన అజ్ఞానములను;
ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి = బలమైన జ్ఞానము అనే నిప్పుతో కాల్చి వేసి;
కర్మవిరహితులై = [అందు మూలముగా] కర్మలను నివృత్తి చేసికొని;
హరిఁగనుట మేలు = [తద్వారా కలుగు జ్ఞానమే పరమాత్వ తత్వము గాన; అట్టి] భగవంతుని చూచుట శ్రేష్ఠము;
సాధన
సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞానకారణంబు
కలవంటి, దింతియ కాని నిక్కము గాదు, సర్వార్థములు మనస్సంభవములు
స్వప్నజాగరములు సమములు, గుణశూన్యుఁడగు పరమునికి గుణాశ్రయమున
భవవినాశంబులు పాటిల్లి నట్లుండుఁ బట్టి చూచిన లేవు బాలురార!

కడఁగి త్రిగుణాత్మకములైన కర్మములకు
జనకమై వచ్చు నజ్ఞానసముదయమును
ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి
కర్మవిరహితులై హరిఁగనుట మేలు
saMsAra midi buddhisAdhyamu guNakarma gaNabaddha maj~nAnakAraNaMbu
kalavaMTi, diMtiya kAni nikkamu gAdu, sarvArthamulu manassaMbhavamulu
svapnajAgaramulu samamulu, guNaSUnyu@MDagu paramuniki guNASrayamuna
bhavavinASaMbulu pATilli naTluMDu@M baTTi cUcina lEvu bAlurAra!

kaDa@Mgi triguNAtmakamulaina karmamulaku
janakamai vaccu naj~nAnasamudayamunu
ghanatara j~nAnavahnicE@M gAlci pucci
karmavirahitulai hari@MganuTa mElu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)