పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 120   Prev  /  Next

జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు
లెవ్వనిచేత నెఱుంగంబడు నతండాత్మయండ్రు,
కుసుమధర్మంబులైన గంధంబులచేత
గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగిం
ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన
బుద్ధిభేదంబుల నాత్మ నెఱుంగందగు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

बुद्धेर्जागरणं स्वप्नः सुषुप्तिरिति वृत्तयः ।
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ॥
एभिस्त्रिवर्णैः पर्यस्तैर्बुद्धिर्भेदैः क्रियोद्भवैः ।
स्वरूपमात्मनो बुध्येद् गन्धैर्वायुमिवान्वयात् ॥

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః ।
తా యేనైవానుభూయన్తే సోऽధ్యక్షః పురుషః పరః ॥
ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిర్భేదైః క్రీయోద్భవైః ।
స్వరూపమాత్మనో బుధ్యేద్ గంధైర్వాయుమివాన్వయాత్ ॥
వ్యాఖ్య
సాధన
జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు
లెవ్వని
చేత నెఱుంగంబడు నతండాత్మయండ్రు,
కుసుమధర్మంబులైన గంధంబులచేత
గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగిం
ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన
బుద్ధిభేదంబుల నాత్మ నెఱుంగందగు.
jAgaraNasvapna sushuptulanu vRttu
levvani
cEta ne~ruMgaMbaDu nataMDAtmayaMDru,
kusumadharmaMbulaina gaMdhaMbulacEta
gaMdhASrayuMDayina vAyuvu ne~riMgeDu bhaMgiM
driguNAtmakaMbulayi karmajanyaMbu layina
buddhibhEdaMbula nAtma ne~ruMgaMdagu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)