పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 118   Prev  /  Next

(తరగతి క్రమము 34)
పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! వినుము సంసారాగ్ని వేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ నీవు దక్క నన్యులు లేరు దలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు బోధముచే మాయ నడఁతువు నిశ్శ్రేయసాత్మయందు

మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప
సేసి ధర్మముఖ్యచిహ్నమయిన
శుభముసేయు దీవు సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు జగన్నివాస!
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 147
అర్జునుడు కృష్ణుని ఇట్లు ప్రార్థించెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకములకు పోతనగారు చేసిన అనువాదము.

कृष्ण कृष्ण महाबाहो भक्तानामभयंकर ।
त्वमेको दह्यमानानामपवर्गोऽसि संसृते ॥
त्वमाद्यः पुरुषः साक्षादीश्वरः प्रकृतेः परः ।
मायां व्युदस्य चिच्छक्त्या कैवल्ये स्थित आत्मनि ॥
स एव जीवलोकस्य मायामोहितचेतसः ।
विधत्से स्वेन वीर्येण श्रेयो धर्मादिलक्षणम्॥
तथायं चावतारस्ते भुवो भारजिहीर्षया ।
स्वानां चानन्यभावानामनुध्यानाय चासकृत्॥

కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామభయంకర ।
త్వమేకో దహ్యమానానామపవర్గోऽసి సంసృతేః ॥
త్వమాద్యః పురుషః సాక్షాదీశ్వరః ప్రకృతేః పరః ।
మాయాం వ్యుదస్య చిచ్ఛక్త్యా కైవల్యే స్థిత ఆత్మని ॥
స ఏవ జీవలోకస్య మాయామోహితచేతసః ।
విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాదిలక్షణం ॥
తథాయం చావతారస్తే భువో భారజిహీర్షయా ।
స్వానాం చానన్యభావానామనుధ్యానాయ చాసకృత్ ॥
వ్యాఖ్య
పద్మలోచన! = కమలముల వంటి కన్నులు గలవాడా! (నాలుగు వందల కోట్ల (4 billion) కన్నులు గలవాడా!);
కృష్ణ! = ఓ కృష్ణ!;
భక్తాభయప్రద! = భక్తులకు అభయమును ప్రసాదించువాడా;
వినుము = (నా ఆర్తనాదమును) ఆలకించుము;
సంసారాగ్ని వేఁగుచున్న = సంసారము అనే అగ్ని లో వేగిఫోవుచున్న;
జనుల = ప్రజలయొక్క;
సంసారంబు సంహరింపఁగ = (అజ్ఞానముతో గూడిన) సంసార దుఃములను తొలగించగలిగిన వాడవు;
నీవు దక్క నన్యులు లేరు దలఁచి చూడ = నీవు మాత్రమే - ఇంకెవరూ లేరు;
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు = ప్రత్యక్షమ్యిన ఈశ్వరుడవు (విశ్వమునకు అధినేతవు);
ప్రకృతికి నవ్వలి ప్రభుఁడవు = ఈ ప్రకృతికి వెలుపలనున్న ప్రభుడవు (గుణరహితమయిన వాడవు);
ఆద్య పురుషుండవగు నీవు = ఆది పురుషుడవయిన నీవు;
బోధముచే మాయ నడఁతువు = జ్ఞానమును ప్రసాదించి మాయను పోగొట్టుదువు;
నిశ్శ్రేయసాత్మయందు = మోక్షమును కోరిన వారికి;

మాయచేత మునిఁగి మనువారలకు = మాయలో మునిగి జీవించువారికి;
కృపసేసి = దయతో;
ధర్మముఖ్యచిహ్నమయిన శుభముసేయు దీవు = ధర్మము మొదలయిన వానికి గుర్తుగా కలిగిన శుభమును చేయుదువు;
సుజనుల నవనిలోఁ గావఁ బుట్టుదువు = (అనన్య భావముతో నిన్ను ధ్యానించు) సజ్జనులను ఈ భూమిలో కాపాడుటకు (వారి భారములను తొలగించుటకు) నీవు జన్మింతువు;
జగన్నివాస!ఆ = ఓ జగన్నివాస;
సాధన
పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! వినుము సంసారాగ్ని వేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ
నీవు దక్క నన్యులు లేరు దలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు
బోధముచే మాయ నడఁతువు నిశ్శ్రేయసాత్మయందు

మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప
సేసి
ధర్మముఖ్యచిహ్నమయిన
శుభముసేయు దీవు
సుజనుల నవనిలోఁ
గావఁ బుట్టుదువు
జగన్నివాస!
padmalOcana! kRshNa! bhaktAbhayaprada! vinumu saMsArAgni vE@Mgucunna
janula saMsAraMbu saMhariMpa@Mga
nIvu dakka nanyulu lEru dala@Mci cUDa
sAkshAtkariMcina sarvESvaruMDavu prakRtiki navvali prabhu@MDa vAdya
purushuMDavagu nIvu
bOdhamucE mAya naDa@Mtuvu niSSrEyasAtmayaMdu

mAyacEta muni@Mgi manuvAralaku@M gRpa
sEsi
dharmamukhyacihnamayina
SubhamusEyu dIvu
sujanula navanilO@M
gAva@M buTTuduvu
jagannivAsa!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)