పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 74   Prev  /  Next

నిర్గత కర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు
హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబుగాదు.
ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్ననది
ప్రశంసంబై యుండదు.
భక్తి హీనంబులయిన జ్ఞాన వాచ కర్మ కౌశలంబులు నిరర్థకంబులు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 98
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

नैष्कर्म्यमप्यच्च्युतभाववर्जितम् न शोभते ज्ञानमलं निरंजनम् ।
कुतः पुनः शश्वदभद्रमीश्वरे न चार्पितं कर्म यदप्यकारणम् ॥

నైష్కర్మ్యమప్యచ్చ్యుతభావవర్జితమ్ న శోభతే జ్ఞానమలం నిరంజనమ్ ।
కుతః పునః శశ్వదభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణమ్ ॥
వ్యాఖ్య
వ్యాకుల చిత్తుడైన వ్యాసునికి నారదుడు భాగవతమును రచించమని చెప్పిన సందర్భములో ఈ విధముగా పలికెను.

నిర్గత కర్మంబై = స్వప్రయోజనముగాని;
నిరుపాధికంబైన = కారణములేనటువంటి;
జ్ఞానంబు = జ్ఞానమయినను;
హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబుగాదు = భగవంతుని భక్తి లేకున్న గొప్పగా శోభిల్లదు;
ఫలంబు గోరక కర్మంబు = ఫలితము కోరక చేసిన కర్మ కూడా;
ఈశ్వరునకు సమర్పణంబు సేయకున్న = భగవంతునికి సమర్పించకున్న;
అది ప్రశంసంబై యుండదు = అది పొగడదగినది కాదు;
భక్తి హీనంబులయిన జ్ఞాన వాచ కర్మ కౌశలంబులు = [కనుక] భక్తి లేనటువంటి జ్ఞానము, పలుకులు, కర్మలలో నేర్పరితనము;
నిరర్థకంబులు = ప్రయోజనము లేనటువంటివి.
సాధన
నిర్గత కర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు
హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబుగాదు.
ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్ననది
ప్రశంసంబై యుండదు.
భక్తి హీనంబులయిన జ్ఞాన వాచ కర్మ కౌశలంబులు నిరర్థకంబులు.
nirgata karmaMbai nirupAdhikaMbaina j~nAnaMbu
haribhakti lEkunna viSEshaMbuga SObhitaMbugAdu.
phalaMbu gOraka karmam bISvarunaku samarpaNaMbu sEyakunnanadi
praSaMsaMbai yuMDadu.
bhakti hInaMbulayina j~nAna vAca karma kauSalaMbulu nirarthakaMbulu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)