పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 123   Prev  /  Next

(తరగతి క్రమము 57)
పరమపూరుషు డొక్కడాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞలబ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.
ఛందస్సు (Meter): తరలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 60
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

सत्त्वं रजस्तम इति प्रकृतेर्गुणास्तैर्युक्तः परः पुरुष एक इहास्य धत्ते।
स्थित्यादये हरिविरिञ्चिहरेति संज्ञाः श्रेयांसि तत्र खलु सत्त्वतनोर्नृणां स्युः॥

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే ।
స్థిత్యాదయే హరివిరిఞ్చిహరేతి సంజ్ఙాః శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః ॥
వ్యాఖ్య
భాగవత కథారంభములో సూతుడు ఈ విధముగా చెప్పెను:

పరమపూరుషుడు - ఒక్కడు - ఆఢ్యుఁడు = [ఈ సకల విశ్వమునకు] ఆది అయిన పరమ పురుషుడు ఒక్కడే;
పాలన - ఉద్భవ - నాశముల్ సొరిదిఁ జేయు = పరిపాలన, పుట్టుక, నాశములను క్రమపద్ధతిలో చేయు;
ముకుంద పద్మజ శూలి సంజ్ఞల = ముకుందుడు (విష్నువు), పద్మజుడు (బ్రహ్మ), శూలి (శివుడు) రూపములలో;
ప్రాకృత స్ఫురిత = స్ఫురించుచు (లేదా ఆ రూపములు దాల్చి);
సత్త్వ రజః - తమంబులఁ బొందు = సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములను కలిగించును;
అందు శుభస్థితుల్ = ఆ మూడింటిలో శుభమయిన కార్యములు;
హరి = విష్ణువు;
చరాచరకోటి కిచ్చు = కదిలెడు, కదలని అన్ని జీవులకు ఇచ్చును;
అనంత సత్త్వ నిరూఢుఁడై = అపరిమితమైన సాత్త్విక గుణముతో ప్రసిద్ధిగావించి.

1. సత్త్వ, రజో, తమో గుణములు మూడును ఆ పరమాత్మ రూపమే నని చెప్పబడినది.
2. విష్ణువు, బ్రహ్మ, శివ - ఆ మూడు రూపములు ఆ పరమాత్మ రూపమేనని చెప్పబడినది.
3. పాలన, ఉత్పత్తి, నాశనము - ఆ మూడును ఆ పరమాత్మ రూపమేనని చెప్పబడినది.

భగవద్గీత లోని 14వ అధ్యాయము గుణత్రయవిభాగయోగములోని నాలుగవ శ్లోకములో కూడా, ఈ మూడు గుణములు ఆ మూల ప్రకృతినుండి సంభవించినవని, ఆ మూడు గుణములు అవ్యయమైన ఆత్మను బంధించుచున్నవని చెప్పబడినది:

సత్వం రజస్తమ ఇతిగుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం ॥
సాధన
పరమపూరుషు డొక్కడాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు
ముకుంద పద్మజ శూలి సంజ్ఞలబ్రాకృత
స్ఫురిత
సత్త్వ రజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు
ననంత సత్త్వ నిరూఢుఁడై.
paramapUrushu DokkaDADhyu@MDu pAlanOdbhava nASamul
soridi@M jEyu
mukuMda padmaja SUli saMj~nalabrAkRta
sphurita
sattva rajastamaMbula@M boMdu naMcu Subhasthitul
hari carAcarakOTi kiccu
nanaMta sattva nirUDhu@MDai.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)