పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 7   Prev  /  Next

(తరగతి క్రమము 17)
అతిరహస్యమైన హరిజన్మకథనంబు
మనుజుఁడెవ్వఁడేని మాపురేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగిపోవు.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 66
ఈ పద్యము ఈ క్రింది మూల శ్లోకమునకు పోతనగారి అనువాదము:

जन्म गुह्यं भगवतो य एतत्प्रयतो नरः।
सायं प्रातर्ग​ृणन् भक्त्या दुःखग्रामाद्विमुच्यते॥

జన్మ గుహ్యం భగవతో య ఏతత్ ప్రయతో నరః ।
సాయం ప్రాతర్ గ్రుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే ॥
వ్యాఖ్య
గుహ్యం=రహస్యములు;
ప్రయతః=ప్రయత్నించి;
సాయం = సాయంకాలము;
ప్రాతః=ఉదయము;
గ్రుణన్=చదివిన;
భక్త్యా =భక్తితో;
దుఃఖగ్రామాత్=అన్ని దుఃఖములనుండి;
విముచ్యతే=విముక్తి నొందును.
సాధన
అతిరహస్యమైన హరిజన్మకథనంబు
మనుజుఁడెవ్వఁడేని మాపురేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగిపోవు.
atirahasyamaina harijanmakathanaMbu
manujuDevvaDEni mApurEpu
jAla bhaktitODa jadivina saMsAra
du@hkharASi bAsi tolagipOvu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)