పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 19   Prev  /  Next

(తరగతి క్రమము 60)
హరినామ కథన దావానల జ్వాలచేఁ గాలవే ఘోరాఘ కాననములు!
వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేఁ దొలగవే భవ దుఃఖ తోయదములు!
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ గూలవే సంతాప కుంజరములు!
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిఁ దీరవే షడ్వర్గ తిమిరతతులు!

నలిన నయన భక్తి నావచేఁ గాక సం
సార జలధి దాఁటి చనగ రాదు
వేయునేల! మాకు విష్ణు ప్రభావంబు
దెలుపవయ్య సూత! ధీ సమేత!
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 50
వ్యాఖ్య
సూతుని శౌనకాది మునులు భాగవతారంభములో ఈ విధముగా కోఱెను:

హరినామ కథన = హరినామముతోగూడిన కథలు అనెడి (లేదా సంకీర్తనము అనెడి);
దావానల జ్వాలచేఁ = దావానల (wildfire) మంటలలో;
కాలవే ఘోరాఘ కాననములు = కాలిపోవా భయంకరమయిన పాపములు (అఘ) అనెడి అడవులు!;
వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేఁ = వైకుంఠ దర్శనము అనెడి గాలి సమూహములచే;
తొలగవే భవ దుఃఖ తోయదములు = తొలగిపోవా సంసారదుఃఖములు అనెడి మేఘములు!;
కమలనాభ ధ్యాన = కమలనాభుని ధ్యానము అనెడి;
కంఠీరవంబుచేఁ = సింహము వలన;
కూలవే సంతాప కుంజరములు = కూలిపోవా సంతాపములు అనెడి యేనుగులు (కుంజరములు)!;
నారాయణ స్మరణ = నారాయణ స్మరణము అనెడి;
ప్రభాకరదీప్తిఁ = సూర్యకాంతి వలన;
తీరవే షడ్వర్గ తిమిరతతులు = తీరిపోవా అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) అనెడి చీకటి (తిమిర) సమూహములు!

నలిన నయన = తామర కన్నులు గలవాని (నారాయణుని);
భక్తి నావచేఁ గాక = భక్తి అనెడి పడవచే గాక;
సంసార జలధి దాఁటి చనగ రాదు = సంసారము అనెడి సముద్రమును దాటి వేయలేము;
వేయునేల = వేయి మాటలెందుకు;
మాకు విష్ణు ప్రభావంబు దెలుపవయ్య = విష్ణువుయొక్క ప్రభావమును తెలియజేయవయ్య;
సూత = [ఓ] సూత!;
ధీ సమేత = బుద్ధి (ధీ) కలిగినవాడా!
సాధన
హరినామ కథన దావానల జ్వాలచేఁ గాలవే ఘోరాఘ కాననములు!
వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేఁ దొలగవే భవ దుఃఖ తోయదములు!
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ గూలవే సంతాప కుంజరములు!
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిఁ దీరవే షడ్వర్గ తిమిరతతులు!

నలిన నయన భక్తి నావచేఁ గాక సం
సార జలధి దాఁటి
చనగ రాదు
వేయునేల! మాకు విష్ణు ప్రభావంబు
దెలుపవయ్య సూత! ధీ సమేత!
harinAma kathana dAvAnala jvAlacE gAlavE ghOrAgha kAnanamulu!
vaikuMTha darSana vAyu saMghaMbu cE@M dolagavE bhava du@Hkha tOyadamulu!
kamalanAbha dhyAna kaMThIravaMbucE@M gUlavE saMtApa kuMjaramulu!
nArAyaNa smaraNa prabhAkaradIpti@M dIravE shaDvarga timiratatulu!

nalina nayana bhakti nAvacE@M gAka saM
sAra jaladhi dA@MTi
canaga rAdu
vEyunEla! mAku vishNu prabhAvaMbu
delupavayya sUta! dhI samEta!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)