పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 126   Prev  /  Next

(తరగతి క్రమము 65)
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవలీన మనీషా
లాలసు లగు మానవులను
గాలము వంచించు దురవగాహము సుమతీ!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 308
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

एवं गृहेषु सक्तानां प्रमत्तानां तदीहया ।
अत्यक्रामदविज्ञातः कालः परमदुस्तरः ॥

ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా।
అత్యక్రామదవిజ్ఞాతః కాలః పరమదుస్తరః॥
వ్యాఖ్య
[యుధిష్ఠురుడు అడిగిన ప్రశ్నలకు విదురుడు వంశ చరిత్రను చెప్పెను, ఏ విధముగా పాపాత్ములు నాశనమయెనో చెప్పెను. ఈ కథను చెప్పిన పిమ్మట, సూతుడు శౌనకాది మునులతో ఈ విధముగా చెప్పెను:]

బాలాజన = స్త్రీలు (లేదా భార్యలు);
శాలా = భవనాలు;
ధన = డబ్బు;
లీలావన = అందమయిన వనములు;
ముఖ్య విభవలీన మనీషా = ముఖ్యమయిన సంపదలని జీవించు మనుషులను;
లాలసు లగు మానవులను = (ఈ విషయములలో పూర్తిగా) మునిగి తేలుతూ ఉన్న మానవులను;
కాలము = (తరిగిపోతూ ఉన్న జీవిత) కాలము;
వంచించు = మోసము చేయును;
దురవగాహము = (ఈ మాయను అర్థము చేసికొనుట) చాలా కష్టము;
సుమతీ! = ఓ మంచి మనసు గలవాడా! (ఓ శౌనకా!)
సాధన
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవలీన మనీషా
లాలసు లగు మానవులను
గాలము వంచించు దురవగాహము సుమతీ!
bAlAjana SAlA dhana
lIlAvana mukhya vibhavalIna manIshA
lAlasu lagu mAnavulanu
gAlamu vaMciMcu duravagAhamu sumatI!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)