పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 42   Prev  /  Next

(తరగతి క్రమము 15)
ఇంచుక మాయలేక మదినెప్పుడుఁ బాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సే
వించు నతండెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరియుదార మహాద్భుత కర్మమార్గముల్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 71
ఇది ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङगपाणेः।
योऽमायया संततयानुवृत्या भजेत तत्पादसरोजगन्धम्॥

స వేద ధాతుః పదవీం పరస్య దురంతవీర్యస్య రథాఞ్గపాణేః ।
యోऽమాయయా సంతతయానువృత్యా భజేత తత్పాదసరోజగంధం॥
వ్యాఖ్య
ఇంచుక మాయలేక = కొంచెమైనా మోసము లేకుండగ;
మదినెప్పుడు = మనసులో ఎల్లపుడు;
పాయని భక్తితోడ = స్థిరమైన లేదా దృఢమైన భక్తితో;
వర్తించుచు = ప్రవర్తించుచు;
ఎవ్వడేని = ఎవరైనా;
హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు = భగవంతుని పాదములు అనే కమలముయొక్క సువాసనను సేవించునో;
అతం డెఱుంగు = అట్టివాడు తెలిసికొనును;
అరవింద భవాదులకైన = బ్రహ్మ వంటి వారికైన;
దుర్లభోదంచితమైన = కష్టమైన;
ఆ హరి = ఆ భగవంతుని;
ఉదార మహాద్భుత కర్మమార్గముల్ = ఉదారమైన, మహా అద్భుతమైన, పని విధానములు.
సాధన
ఇంచుక మాయలేక మదినెప్పుడుఁ బాయని భక్తితోడ వ
ర్తించుచు
నెవ్వఁడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సే
వించు
నతండెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన
యా హరియుదార మహాద్భుత కర్మమార్గముల్.
iMcuka mAyalEka madineppuDu@M bAyani bhaktitODa va
rtiMcucu
nevva@MDEni haridivya padAMbuja gaMdharASi sE
viMcu
nataMDe~ruMgu naraviMda bhavAdulakaina durlabhO
daMcitamaina
yA hariyudAra mahAdbhuta karmamArgamul.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)