పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 164   Prev  /  Next

(తరగతి క్రమము 97)
వైరాను బంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగ రాదని తోఁచును
నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 15
భక్తి మార్గము కంటే కూడా, ద్వేషముతో భగవంతుని త్వరగా చేరవచ్చునని తన గట్టి నమ్మకమని నారదుడు ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यथा वैरानुबंधेन मर्त्यस्तन्मयतामियात् ।
न तथा भक्तियोगेन इति मे निश्चिता मतिः ॥

యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ ।
న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః ॥
వ్యాఖ్య
శిశుపాలకులవంటి శత్రువులు భగవంతుని చేరుట యేమి యని యుధిష్టురుడు అడుగగా నారదుడు భగవంతుని తత్వమును వివరించి, మఱియు ఇట్లు పలికెను.

ఇందలి సారాంశము బహు లోతైనది. భక్తి కూడా ఒక కోరికయేనని తెలిసికొనినపుడు, ఆ కోరికను కూడా నిరాకరించుట భగవంతుని ద్వేషముతో పోల్చవచ్చును. అయితే కామ క్రోధాదులలో మునిగియున్న మనుజుడు నేరుగా ఈ స్థితిని పొందగలుగుట కష్టతరము. పూర్వము నారదుడు "యమ నియమాది" యోగముల వలన ఆత్మ నియంత్రితమయినప్పటికిని, కామ రోషాదుల వలన ప్రచోదితమగునని, విష్ణు సేవచే శాంతి కలుగునని తెలిపెను [1.132]. ఒక పరి శాంతి కలిగిన పిదప, భగవంతుని చేరుటకు భక్తిని కూడా వదలి వేయదగునని ఈ శ్లోకముయొక్క అంతర్యార్థమని చెప్పవచ్చును.
సాధన
వైరాను బంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగ రాదని తోఁచును
నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్.
vairAnu baMdhanaMbuna@M
jErina caMdamuna vishNu@M jiratara bhaktiM
jEra@Mga rAdani tO@Mcunu
nArAyaNa bhakti yukti nA cittamunan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)