పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 87   Prev  /  Next

ఓడితివో శత్రువులకు
నాడితివో సాధు దూషణాలాపములం;
గూడితివో పరసతులను
వీడితివో మానధనము వీరుల నడుమన్!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 354
ఈ పద్యము, తరువాతి రెండు పద్యములు ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

कच्चित्वं ब्राह्मणं बालं गां वृद्धं रोगिणं स्त्रियम्।
शरणोपस्रतं सत्त्वं नात्याक्षीः शरणप्रदः॥
कच्चित्त्वं नागमोऽगम्यां गम्यां वासत्कृतां स्त्रियम्।
पराजितो वाथ भवान्नोत्तमैर्नासमैः पथि॥
अपि स्वित्पर्यभुङक्थास्त्वं सम्भोज्यान् वृद्धबालकान्।
जुगुप्सितं कर्म किंचित्कृतवान्न यदक्षमम्॥

కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియమ్।
శరణోపస్రతం సత్వం నాత్యాక్షీః శరణప్రదః॥
కచ్చిత్వం నాగమోऽగమ్యాం గమ్యాం వాసత్కృతాం స్త్రియమ్।
పరాజితో వాథ మవాన్నోత్తమైర్నాసమైః పథి॥
అపి స్విత్పర్యభుఙ్క్థాస్త్వం సంభోజ్యాన్ వృద్ధబాలకాన్।
జుగుప్సితం కర్మ కించిత్కృతవాన్న యదక్షమమ్॥
వ్యాఖ్య
ద్వారకా నగరం నుండి తిరిగివచ్చి "పల్లటిలిన యుల్లముతో దల్లడపడుచున్న పిన్నతమ్ముని" (1.346), గతంలో సంభవించిన అనేక కఠిన పరిస్థితులలో కూడ "కన్నీ రెన్నఁడుఁ దే"వని (1.352) అర్జునుని చూచి ధర్మరాజు అందరు క్షేమమేనా అని పేరుపేరునా అడిగి, సమాధానం లేకపోగా చివరకు ఈ విధముగా ప్రశ్నించును.
సాధన
ఓడితివో శత్రువులకు
నాడితివో సాధు దూషణాలాపములం;
గూడితివో పరసతులను
వీడితివో మానధనము వీరుల నడుమన్!
ODitivO Satruvulaku
nADitivO sAdhu dUshaNAlApamulaM
gUDitivO parasatulanu
vIDitivO mAnadhanamu vIrula naDumana^!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)