పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 176   Prev  /  Next

(తరగతి క్రమము 36)
యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా!
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 199
కుంతీదేవి శ్రీ కృష్ణుని ఈ విధముగా వేడుకొనెను.
వ్యాఖ్య
యాదవులందుఁ = (తన పుట్టింటి సంబంధులయిన) యాదవులందు;
పాండుసుతులందున్ = (తన సంతానమయిన) పాండురాజుని కుమారులందును;
అధీశ్వర! = ఓ అధీశ్వరా! (రారాజువయిన వాడా);
నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య = (ఈ బంధాలనుంచి) నాకు ప్రేమ బంధాలను త్రెంచుము స్వామీ;
ఘన సింధువుఁ జేరెడి గంగభంగి = మహా సముద్రమును చేరెడి గంగానది వలె;
నీ పాదసరోజ చింతనముపై = నీ పాద కమలములను మాత్రమే (నామనసు) చింతించునట్లు;
అనిశంబు మదీయబుద్ధిన్ = ఎల్లప్పుడు నా బుద్ధి;
అత్యాదరవృత్తితోఁ = అతి క్రమశిక్షణతో;
కదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా! = (నీ పాదములకు) దగ్గర యగునట్లు చేయవయ్య ఓ యీశ్వరా!
సాధన
యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య
ఘన సింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై
ననిశంబు మదీయబుద్ధి
త్యాదరవృత్తితోఁ
గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా!
yAdavulaMdu@M bAMDusutulaMdu nadhISvara! nAku mOha vi
cCEdamu sEyumayya
ghana siMdhuvu@M jEreDi gaMgabhaMgi nI
pAdasarOja ciMtanamupai
naniSaMbu madIyabuddhi na
tyAdaravRttitO@M
gadiyu naTluga@M jEya@Mgadayya! yISvarA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)