పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 5   Prev  /  Next

ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మషజేతకున్‌ నత
త్రాతకు ధాతకున్‌ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్‌.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 3
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు బ్రహ్మ దేవునిమీద పోతనగారు చేసిన ప్రార్థన.

ఆతత = చాలా, విరివిగా (great);
సాధన
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు
భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు
దేవతా నికర నేతకుఁ గల్మషజేతకున్‌ నత
త్రాతకు ధాతకున్‌
నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్‌.
Atata sEva@M jEseda samasta carAcara bhUta sRshTi vi
j~nAtaku
bhAratI hRdayasaukhya vidhAtaku vEda rASi ni
rNEtaku
dEvatA nikara nEtaku@M galmashajEtakun nata
trAtaku dhAtakun
nikhila tApasa lOka Subha pradAtakun.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)