పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 79   Prev  /  Next

(తరగతి క్రమము 21)
తన కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవ సేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన మరు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్!
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 100
ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

त्यक्त्वा स्वधर्मं चरणांबुजं हरे र्भजन्न पक्वोऽथ पतेत्ततो यदि ।
यत्र क्व वाभद्रमभूदमुष्य किं को वार्थ आप्तोभजतां स्वधर्मतः ॥

త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే ర్భజన్న పక్వోథ పతేత్తతో యది ।
యత్ర క్వ వాభద్రమభూదముష్యకిం కో వార్థ ఆప్తోభజతాం స్వధర్మతః ॥
వ్యాఖ్య
తన కులధర్మమున్ విడిచి = (మానవుడు) తన స్వధర్మమును విడనాడి;
దానవవైరి పదారవిందముల్ = రాక్షసుల శత్రువు (అనగా భగవంతుని) పద కమలములను;
పనివడి సేవ సేసి = ప్రయత్నపూర్వకుగా సేవచేసి;
పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జచ్చిన = మోక్ష సాధన పూర్తిగాకుండగనే ఎవరైన మరణించినచో;
మరు మేన నైన నది సిద్ధి వహించుఁ = (ఆ ప్రయత్నము నిరర్ధకము కాదు) మరియొక జన్మములోనైనను అది సిద్ధిని కలుగజేయును;
దదీయ సేవఁ బాసినఁ గుల ధర్మగౌరవము = ఆ భగవంతుని సేవకు దూరమైన స్వధర్మములు ఎన్ని గావించినను;
సిద్ధి వహించునె యెన్ని మేనులన్ = (ఆ తీరు) ఎన్ని జన్మలలోననైన సిద్ధి కలిగించునా? (కలిగించదు అని భావము.)

ఇవి నారదుడు వ్యాసునితో చెప్పిన మాటలు. వ్యాసునకు భగవంతుని లీలలను సామాన్య మానవులకు సైతము తెలిసే రీతిలో వ్రాయమని చెప్పి, మోక్ష సాధనయందు, భగవంతుని స్వరూపమునందు ఆసక్తి యున్నవారు నియతమైన (regular) సాధన చేయవలయునని, కాలక్రమంబున కష్ట సుఖాలు ప్రాప్తించినప్పటికిని హరి సేవను విడువరాదని, ఆ సేవలో పరిపాకము చెందకున్నను అది నిరర్ధకము కాదని, ఇంక యే ఇతర ధర్మములను ఎంతగా పాటించినను మోక్షము సంభవించదని నారదుడు చెప్పెను.
సాధన
తన కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవ సేసి
పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన
మరు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము
సిద్ధి వహించునె యెన్ని మేనులన్!
tana kuladharmamun viDici dAnavavairi padAraviMdamul
panivaDi sEva sEsi
paripAkamu voMdaka yevva@MDEni@M ja
ccina
maru mEna naina nadi siddhi vahiMcu@M dadIya sEva@M bA
sina@M gula dharmagauravamu
siddhi vahiMcune yenni mEnulan!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)