పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 133   Prev  /  Next

(తరగతి క్రమము 100)
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 46
పతి వియోగమునకు రొదించుచున్న రాణులనుజూచి బాలరూపములోనున్న యముడు ఈ విధముగా పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.
श्रीयम उवाच​
अहो अमीषां वयसाधिकानां विपश्यतां लोकविधिं विमोहः ।
यत्रागतस्तत्र गतं मनुष्यं स्वयं सधर्मा शोचन्त्यपार्थम् ॥
వ్యాఖ్య
హిరణ్యాక్షుని మరణమునకు శోకించుచున్న బంధుజనులను ఓదార్చుచు హిరణ్యకశిపుడు ఉశీనరదేశ రాజు కథను వివరించెను. ఆ కథలో తన భర్త మరణమునకు శోకించుచున్న రాణులను జూచి యముడు ఈ విధముగా పలికెను.
సాధన
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని
కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.
maccika vIrikella bahumAtramu@M jOdyamu, dEhi puTTucuM
jaccucunuMDa@M jUcedaru, cAvaka mAneDu vAribhaMgi nI
caccina vAni
kEDcedaru? cAvuna kollaka DA@MgavaccunE?
yeccaTa@M buTTe naccaTiki nEguTa naijamu prANikOTikin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)