పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 158   Prev  /  Next

(తరగతి క్రమము 81)
తొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు
లీనరూపంబులై యుండం
బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబున నొంటి దీపించు
పురాణపురుషుం డితండు [డనువారును,]
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 235
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

स वै किलायं पुरुषः पुरातनो य एक आसीदविशेष आत्मनि ।
अग्रे गुणोभ्यो जगदात्मनीश्वरे निमीलितात्मन्निशि सुप्तशक्तिषु ॥

స వై కిలాయం పురుషః పురాతనో య ఏక ఆసీదవిశేష ఆత్మని ।
అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్ నిశి సుప్తశక్తిషు ॥
వ్యాఖ్య
శ్రీకృష్ణుడు ద్వారకా నగరమునకు ప్రయాణమై వెళ్తున్న సమయములో హస్తినాపురమునందలి పురజనులు శ్రీకృష్ణుని గుణగణములను ఒకరికొకరు ఈ విధముగా చెప్పుకొనుచుండిరని సూతుడు చెప్పెను: ఆదిలో భౌతిక ప్రపంచము రూపు దాల్చక ముందు ప్రళయము జరిగెను. జీవులకు ఎటువంటి గుణములు లేక, భగవంతునిలో లీనమై నిద్రించుచున్నట్లుండెను. అప్పుడు భగవంతుడు ఒక్కడే ప్రకాశించుచుండెను. ఆ రూపమే ఈ నాడు శ్రీకృష్ణుని రూపము దాల్చెను.
సాధన
తొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు
లీనరూపంబులై యుండం
బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబున నొంటి దీపించు
పురాణపురుషుం డితండు [డనువారును,]
tolliTaM braLayaMbuna guNaMbulaM gUDaka jIvulu
lInarUpaMbulai yuMDaM
brapaMcaMbu pravartiMpani samayaMbuna noMTi dIpiMcu
purANapurushuM DitaMDu [DanuvArunu,]
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)