పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 131   Prev  /  Next

శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్ మాధవశేముషీతరణి సాంగత్యంబునం గాక దు
ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుత వధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్.
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 183
పోతనగారు ప్రహ్లాదునిచే ఈ మాటలను పలికించారు.
వ్యాఖ్య
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో "ఒజ్జలు సెప్పని యీ మతి" [7.179] (గురువులు చెప్పనట్టి ఈ జ్ఞానమును) నీకెవరు చెప్పితిరో యని పలుకగా, ప్రహ్లాదుడు తన ధోరణిలో ఇట్లనెను: జనులు చర్విత చర్వణులై అచ్చపు చీకటిలో [7.181] పడి జననమరణముల చక్రములో పడిపోయి భగవంతుని తెలిసికొనలేరు, గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి దారి చూపినట్లు కర్మలను గైకొని జనులు భగవంతుని తెలిసికొనవలెనని ప్రయత్నిస్తూ ఉంటారు [7.182].

అటుపిమ్మట పోతనగారు ప్రహ్లాదునిచే ఈ మాటలను పలికించారు.

శోధింపంబడె = పరిశీలింపబడెను;
సర్వశాస్త్రములు = అన్ని శాస్త్రములు;
రక్షోనాథ! = ఓ రాక్షస రాజా!;
వే యేటికిన్ గాథల్ = వేయి కథలు ఎందులకు?;

మాధవశేముషీతరణి = భగవంతుని జ్ఞానము అనే నావ ను;
సాంగత్యంబునం గాక = చేరుకుంటే తప్ప;
దుర్మేధన్ = [ఏ ఇతర] దుఃఖమును కలిగించు జ్ఞానము వలన;
దాఁటఁగ వచ్చునే = [అరిషడ్వర్గాలతో కూడిన ఈ సంసార సాగరాన్ని] దాటగలేము;

సుత = [ఎందుకంటే ఈ మహా సముద్రములో] కుమార్తెలు [లోభమునకు దారితీయు సంతానము];
వధూ = [మోహమును కలిగించు] భార్యలు;
మీన = [మత్సరమును కలిగించు] చేపలవంటి సంపదలు;
ఉగ్ర వాంఛా = [ఇంకా కామమునకు మూలమైన] భయంకరమైన కోరికలు;
మద = అహంకారము;
క్రోధ = క్రోధము;
ఉత్ + లోల విశాల సంసృతి = [ఈ అరిషడ్వర్గాలు] ఎత్తైన అలల వలె ఈ విశాలమైన సంసారము లో;
మహా ఘోర + అమిత + అంభోనిధిన్ = మహా ఘోరమైన అమితమైన సముద్రము [లో తాండవించి మానవునికి దిక్కు తోచకుండా చేస్తాయి];
సాధన
శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్
గాథల్
మాధవశేముషీతరణి సాంగత్యంబునం గాక దు
ర్మేధన్
దాఁటఁగ వచ్చునే సుత వధూమీనోగ్ర వాంఛా మద
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్.
SOdhiMpaMbaDe sarvaSAstramulu rakshOnAtha! vE yETikin
gAthal
mAdhavaSEmushItaraNi sAMgatyaMbunaM gAka du
rmEdhan
dA@MTa@Mga vaccunE suta vadhUmInOgra vAMCA mada
krOdhOllOla viSAla saMsRti mahA ghOrAmitAMbhOnidhin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)