పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 109   Prev  /  Next

(తరగతి క్రమము 99)
ధనము వీథిఁబడిన దైవవశంబున
నుండుఁ బోవు మూలనున్ననైన
నడవి రక్షలేని యబలుండు వర్థిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 49
ఉశీనర రాజుని వితంతువుల శోకమునకును కదలి వచ్చి బాలుని రూపమున యమధర్మరాజు ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

पथि च्युतं तिष्ठति दिष्टरक्षितं गृहे स्थितं तद्विहतं विनश्यति ।
जीवत्यनाथोऽपि तदीक्षितो वने गृहेऽभिगुप्तोऽस्थ हतो न जीवति ॥

పథి చ్యుతం తిష్ఠతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి ।
జీవత్యనాథోऽపి తదీక్షితో వనే గృహేऽభిగుప్తోऽస్య హతో న జీవతి ॥
వ్యాఖ్య
ఈ కథను, హిరణ్యాక్షుని మరణమునకు శోకించుచున్న తన తల్లియైన దితికి, మఱదలైన రుషాభానునకు, తమ్ముని కుమారులకు (శకుని, శంబర, దృష్టి, భూతసంతాపన, వృక, కాలనాభ, మహానాభ, హరిశ్మశ్రు, మఱియు ఉత్కచ) హిరణ్యకశిపుడు చెప్పెను. హిరణ్యాకశిపుడు చాలా తెలివైన రాజు. ఒక వైపు "కమలోదరుచేతం దన సహోదరుండు హతుండయ్యె నని విని హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుండయి ఘూర్ణిల్లుచు" (7.29), మరొక వైపు రాజుగా తన తమ్ముని మరణమునకు శోకించుచున్న తన బంధువులను ఓదార్చుచుండెను.

నిజమునకు కొన్ని కథలద్వారా తత్వజ్ఞానమును తన తల్లికి బోధించెను. "సర్వజ్ఞుఁ డీశుండు సర్వాత్ముఁ"డని (7.39), ఆత్మస్వరూపమును కూడా వర్ణించెను. కానీ తను మాత్రం కోపావేశములనుండి విముక్తుడు కాకుండెను. కనుక ప్రహ్లాదునికి తెలిసిన జ్ఞానము తనకు తెలియనిది కాదు.

హిరణ్యకశిపుని, ప్రహ్లాదుని కథలను ప్రక్క ప్రక్కనే చూపి భక్తి కలిగిన వాని జీవనము బాలుడైనను ఏవిధముగా ఆ జ్ఞానమును అనుభవించుచుండునో, భక్తిలేని వాని జీవనము (ఎంత తత్వ జ్ఞానము తెలిసినప్పటికిని) ఏ విధముగా ఆ జ్ఞానమును అనుభవించలేదో మనకు తెలియపట్టుచున్నది.
సాధన
ధనము వీథిఁబడిన దైవవశంబున
నుండుఁ
బోవు మూలనున్ననైన
నడవి రక్షలేని యబలుండు వర్థిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు
dhanamu vIthi@MbaDina daivavaSaMbuna
nuMDu@M
bOvu mUlanunnanaina
naDavi rakshalEni yabaluMDu varthillu
rakshituMDu maMdiramuna@M jaccu
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)