పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 4   Prev  /  Next

(తరగతి క్రమము 7)
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్‌
మోదకఖాదికిన్‌ సమద మూషక సాదికి సుప్రసాదికిన్‌.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 5
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు వినాయకుని స్మరించుచూ పోతనగారు చేసిన ప్రార్థన.

ఆదర మొప్ప = పూర్తి గౌరవముతో;
మ్రొక్కిడుదు = మ్రొక్కెదను;
అద్రి సుత = పర్వతము కుమార్తె (అయినట్టి ఉమాదేవి యొక్క);
హృదయానురాగ = మనసు నందు గల ప్రేమను;
సంపాదికి = సంపాదించిన వానికి (the one who earned);
దోష = కల్మషములను;
భేదికి = వేరుచేయువానికి;
ప్రపన్న = శరణు కోరిన వారిని;
వినోదికి = ఆనందింపజేయువానికి;
విఘ్న వల్లిక = తీగలవంటి అంతరాయములను;
ఛేదికి = నరికి వేయు వానికి;
మంజు వాదికి = మనస్సుకు ఇంపైన భాషణ చేయువానికి;
అశేష = పరిమితములేని;
జగజ్జన = ప్రపంచములోని మానవులకు (అనగా భక్తులకు అని అర్ధము);
నంద వేదికి = సంపదను ప్రసాదించు విద్వాంసునకు;
మోదక = కుడుములను;
ఖాదికి = తినువానికి;
సమద = సంతృప్తి కలిగిన;
మూషక = ఎలుక (ను);
సాదికి = అధిరోహించు వానికి;
సు = మంచి, ఎక్కువగా;
ప్రసాదికి = అనుగ్రహించు వానికి; (అనగా ఇటువంటి గుణములు కలిగిన వినాయకునకు అని అర్ధము)
సాధన
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి
దోషభేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి
మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్‌
మోదకఖాదికిన్‌ సమద మూషక సాదికి సుప్రసాదికిన్‌.
Adaramoppa mrokkiDudu nadrisutA hRdayAnurAga saM
pAdiki
dOshabhEdhiki@M brapanna vinOdiki vighnavallikA
cCEdiki
maMjuvAdiki naSEsha jagajjana naMda vEdikin
mOdakakhAdikin samada mUshaka sAdiki suprasAdikin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)