పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 169   Prev  /  Next

(తరగతి క్రమము 31)
వెఱచిన వాని, దైన్యమున వేఁదురు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావిన వాని, భగ్నుఁడై
పఱచినవాని, సాధు జడభావము వానిని, గావు మంచు వా
చఱచిన వాని, గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా!
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 155
శ్రీ కృష్ణుడు అర్జునునితో ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము.

मत्तं प्रमत्तमुन्मत्तं सुप्तं बालं स्त्रियं जडं।
प्रपन्नं विरथं भीतं न रिपुं हन्ति धर्मवित्॥

మత్తం ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ।
ప్రపన్నం విరథం భీతం న రిపుం హంతి ధర్మవిత్ ॥
వ్యాఖ్య
వెఱచిన వాని = భయపడిన వానిని;
దైన్యమున వేఁదురు నొందినవాని = దీనత్వముతో నున్న మూఢుడిని;
నిద్ర మై మఱచినవాని = మైమరచి నిద్రించుచున్న వానిని;
సౌఖ్యమున మద్యము ద్రావిన వాని = మత్తుద్రావకము త్రాగినవానిని;
భగ్నుఁడై పఱచినవాని = ఓడిపోయి పారిపోవుచున్నవానిని;
సాధు జడభావము వానిని = కదలక పడియున్న వానిని;
కావు మంచు వా చఱచిన వాని = రక్షించుమని వేడుకొనినవానిని;
కామినుల = స్త్రీలను;
చంపుట ధర్మము గాదు = చంపుట ధర్మము కాదు;
ఫల్గునా! = ఓ అర్జునా!

ఈ పద్యములో "వెఱచిన వాని" (అనగా భయపడిన వానిని) చంపకూడదు అని యుండుట, దీనికి ముందరి పద్యములో అశ్వత్థామను "ప్రాణ భయంబున" వేడి నిట్టూర్పులు తీయుచున్నవాడుగను వర్ణించుట గమనార్హము.
సాధన
వెఱచిన వాని, దైన్యమున వేఁదురు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని,
సౌఖ్యమున మద్యము ద్రావిన వాని, భగ్నుఁడై
పఱచినవాని, సాధు జడభావము వానిని,
గావు మంచు వా
చఱచిన వాని, గామినులఁ
జంపుట ధర్మము గాదు ఫల్గునా!
ve~racina vAni, dainyamuna vE@Mduru noMdinavAni, nidra mai
ma~racinavAni,
saukhyamuna madyamu drAvina vAni, bhagnu@MDai
pa~racinavAni, sAdhu jaDabhAvamu vAnini,
gAvu maMcu vA
ca~racina vAni, gAminula@M
jaMpuTa dharmamu gAdu phalgunA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)