పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 99   Prev  /  Next

(తరగతి క్రమము 30)
మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్న పాపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై,
పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 154
శ్రీ కృష్ణుడు అర్జునునితో పలికెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

मैनं पार्थार्हसि त्रातुं ब्रह्मबन्धुमिमं जहि।
योऽसावनागसः सुप्तान्नवधीन्निशि बालकान्॥

మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబంధుమిమం జహి ।
యోసావనాగసః సుప్తాన్నవధీన్నిశి బాలకాన్ ॥
వ్యాఖ్య
మాఱుపడంగలేని + అసమర్థుల = ఎదుర్కొనుటకు శక్తిలేనివారలను;
సుప్తుల = నిద్రించుచున్నవారలను;
అస్త్రవిద్యలందేఱని పిన్న పాపల = బాణాది విద్యలందు నేర్పు లేనటువంటి వారలను;
వధించె = చంపెను;
నిశీథమునందుఁ గ్రూరుఁడై = రాత్రివేళ కౄరత్వముతో;
పాఱుఁడె వీఁడు పాతకుఁడు = వీడు (ఈ అశ్వత్థామ) బ్రాహ్మణుడు కాదు, పాపాత్ముడు;
ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుంబాఱెడి వీని = ప్రాణభయముతో వేడి నిట్టూర్పులు తీయుచున్న వీనిని;
కావుము కృపామతిన్ = దయతో క్షమించుము;
అర్జున! = ఓ అర్జునా!;
పాపవర్జనా! = పాపములను విడచువాడా!

కౌరవులలో ప్రధానమైన వాడు దుర్యోధనుడు. అతని దుర్మార్గము, అధర్మమార్గముల వలన కురుక్షేత్ర యుద్ధము పాండవులకు కౌరవులకు మధ్య జరిగెను. ఆ యుద్ధములో బలమైన కౌరవులను ఎదుర్కొనుటకు పాండవులు శ్రీ కృష్ణుని సహాయముతో కొన్ని ధర్మయుద్ధమునకు భిన్నమైన మార్గములను ఆచరించవలసి వచ్చెను. చివరకు దుర్యోధనుని కూడా భీముడు నేలకూల్చెను. దుర్యోధనుని (నిజమునకు అందరి కౌరవులకు, పాండవులకు) గురువైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ చివరిదశలోనున్న దుర్యోధనుని సంతోషపెట్టుటకు అర్ధరాత్రి వేళ పాండవులకొఱకు వెళ్ళి వారు కనుపించకపోగా, నిద్రిస్తున్న వారి కుమారులను చంపి వచ్చును. ఇది తెలిసిన అర్జునుడు ఆశ్వత్థామను చంపెదనని ద్రౌపదికి చెప్పి కృష్ణునితో రథముపై బయలుదేరును. వారిమధ్య కొంత యుద్ధము జరుగును. చివరికి అశ్వత్థామ అర్జునిచేతికి చిక్కును. చిక్కినటువంటి ఆశ్వత్థామ భయముతో వణికిపోవును. ఈ సందర్భములో శ్రీ కృష్ణుడు అర్జునునితో ఈ మాటలను పలికెను.
సాధన
మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్న పాపల వధించె
నిశీథమునందుఁ గ్రూరుఁడై,
పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం
బాఱెడి వీనిఁ
గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!
mA~rupaDaMgalEni yasamarthula suptula nastravidyalaM
dE~rani pinna pApala vadhiMce
niSIthamunaMdu@M grUru@MDai,
pA~ru@MDe vI@MDu pAtaku@MDu, prANabhayaMbuna vecca nUrcucuM
bA~reDi vIni@M
gAvumu kRpAmati narjuna! pApavarjanA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)