పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 66   Prev  /  Next

(తరగతి క్రమము 33)
జననము నైశ్వర్యంబును
ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు నిఖిలవిబుధస్తుత్యా!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 190
కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తుతించుచూ ఈ విధముగా పలికెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము.

जन्मैश्वर्यशुतश्रीभिरेधमानमदः पुमान्।
नैवार्हत्यभिधातुं वै त्वामकिञ्चनगोचरम्॥

జన్మైశ్వర్యశ్రుతశ్రీభిరేధమానమదః పుమాన్ ।
నైవార్హత్యభిధాతుం వై త్వామకిఙ్చనగోచరం ॥
వ్యాఖ్య
జననమున్ = (గొప్ప వంశ చరిత్ర కలిగిన) జన్మమును (కలిగినవారమని);
ఐశ్వర్యంబును = (ఎక్కువ) సంపద కలిగిన (వారమని);
ధనమును = (ఎక్కువ) ధనము కలిగిన (వారమని);
విద్యయును గల = (ఎక్కువ) చదువులు కలిగినటువంటి (వారమని);
మదచ్ఛన్నుల్ = గర్వముతో (జ్ఞానము) కప్పబడినవారు;
అకించన గోచరుఁడగు నిన్నున్ = అన్నిటిని విడనాడినవారికి (మాత్రమే) అగుపించు నిన్ను;
వినుతింపఁగ లేరు = పొగడలేరు (నీ వైభవమును గుర్తించలేరు);
నిఖిలవిబుధస్తుత్యా! = సర్వ పండితులు (గుర్తించి) స్తుతించు వాడా!
సాధన
జననము నైశ్వర్యంబును
ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు
నిఖిలవిబుధస్తుత్యా!
jananamu naiSvaryaMbunu
dhanamunu vidyayunu gala madacChannu lakiM
cana gOcaru@MDagu ninnun
vinutiMpa@Mga lEru
nikhilavibudhastutyA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)