పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 108   Prev  /  Next

(తరగతి క్రమము 101)
ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల
నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ
డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 48
ఉశీనర రాజుని వితంతువుల శోకమునకు కదలి వచ్చి బాలుని రూపమున యమధర్మరాజు ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

य इच्छयेशः सृजतीदमव्ययो य येव रक्षत्यवलुम्बते च यः ।
तस्याबलाः क्रीडनमाहुदीशितुः चराचरं निग्रहसङ्ग्रहे प्रभुः॥

య ఇచ్ఛయేశః సృజతీదమవ్యయో య యేవ రక్షత్యవలుమ్బతే చ యః ।
తస్యాబలాః క్రీడనమాహుదీశితుః చరాచరం నిగ్రహసఙ్గ్రహే ప్రభుః ॥
వ్యాఖ్య
ఎవ్వఁడు సృజించుఁ = ఎవ్వడు సృష్టించునో; బ్రాణుల నెవ్వఁడు రక్షించుఁ = ప్రాణులను ఎవ్వడు రక్షించునో; ద్రుంచు నెవ్వఁడు = (ప్రాణులను) ఎవ్వడు నశింప జేయునో; అనంతుం డెవ్వఁడు = అంతం లేనివాడు (నశించని వాడు) ఎవడో; విభుఁ డెవ్వఁడు = ప్రభువు ఎవడో; వాఁ డివ్విధమున = అతడు ఈ విధముగా; మనుచుఁ బెనుచు = రక్షించుచూ, నశింపజేయుచూ; హేలారతుఁడై = ఆటలను ఆడుకొనుచుండును.
సాధన
ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల
నెవ్వఁడు రక్షించుఁ
ద్రుంచు నెవ్వఁ డనంతుం
డెవ్వఁడు
విభుఁ డెవ్వఁడు వాఁ
డివ్విధమున
మనుచుఁ బెనుచు హేలారతుఁడై.
evva@MDu sRjiMcu@M brANula
nevva@MDu rakshiMcu@M
druMcu nevva@M DanaMtuM
Devva@MDu
vibhu@M Devva@MDu vA@M
Divvidhamuna
manucu@M benucu hElAratu@MDai.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)