పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 75   Prev  /  Next

(తరగతి క్రమము 48)
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 218
మరణ శయ్యపైనున్న భీష్ముడు శ్రీకృష్ణుని ఈ విధముగా స్తుతించెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने ।
वपुरलककुलावृताननाब्जं विजयसखे रतिरतु मेऽनवद्या ॥

త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరాంబరం దధానే ।
వపురలకకులావృతాననాబ్జం విజయసఖే రతిరస్తు మేऽనవద్యా ॥
వ్యాఖ్య
త్రిజగన్మోహన = మూడు లోకముల (అనగా పాతాళము, భూలోకము, స్వర్గలోకముల) యందు గల జీవులను మోహింపజేయగల;
నీలకాంతిఁ = నల్లని లేదా ఆకాశము వంటి రంగు గల;
తనువు - ఉద్దీపింపఁ = శరీరము కాంతులు వెదజల్లుచుండ;
ప్రాభాత = ఉదయపు;
నీరజ బంధు = సూర్యుని (వెలుగులో); ప్రభమైన = ప్రభవించుచు;
చేలము = (తనమీదనున్న) వస్త్రము;
పయిన్ రంజిల్ల = పై భాగములో వెలుగుచుండగా;
నీలాలక వ్రజ = గుంపులుగా ఉన్నట్టి తల వెండ్రుకలతో;
సంయుక్త = కూడుకొన్న;
ముఖారవిందము = పద్మము వలె నున్న ముఖము;
అతి సేవ్యంబై = ఎక్కువగా సేవింపబడుటకు సిద్ధమయి;
విజృంభింప = వికసించుచు;
మా విజయుం జేరెడు వన్నెలాఁడు = అర్జునుని వైపు వచ్చుచున్న మా అందగాడు;
మదిన్ - ఆవేశించున్ - ఎల్లప్పుడున్ = ప్రతి నిత్యము (నా) మనసులో ప్రవేశించి (నిలిచి) యుండును.
సాధన
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల
నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై
విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు
మది నావేశించు నెల్లప్పుడున్.
trijaganmOhana nIlakAMti@M danu vuddIpiMpa@M brAbhAta nI
rajabaMdhuprabhamaina cElamu payin raMjilla
nIlAlaka
vraja saMyukta mukhAraviMda mati sEvyaMbai
vijRMbhiMpa mA
vijayuM jEreDu vannelA@MDu
madi nAvESiMcu nellappuDun.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)