పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 117   Prev  /  Next

(తరగతి క్రమము 41)
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 224
మహాభారత యుద్ధము జరిగిన తరువాత, మరణ శయ్యపైనున్న భీష్ముడు శ్రీకృష్ణుని ఈ విధముగా స్తుతించెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

ललितगतिविलासवल्गुहासप्रणयनिरीक्षणकल्पितोरुमानाः ।
कृतमनुकृतवत्य उन्मदान्धाः प्रकृतिमगन् किल यस्य गोपवध्वः ॥

లలితగతివిలాసవల్గుహాస ప్రణయనిరీక్షణకల్పితోరుమానాః ।
కృతమనుకృతవత్య ఉన్మదాంధాః ప్రకృతిమగాన్ కిల యస్య గోపవధ్వః ॥
వ్యాఖ్య
పలుకుల = పలుకులతో;
నగవుల = చిరునవ్వులతో;
నడపుల = ప్రవర్తనలతో;
అలుకల = కోపములతో;
అవలోకనముల = చూపులతో;
ఆభీరవధూ కులముల = ఆభీరదేశము (అనగా గోపికలు నివశించు వ్రజ దేశము లోని - ఈ నాటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములోని మథుర, వృందావన్ ప్రాంతములోని) వధువుల;
మనముల తాలిమి = మనస్సులలోని ప్రేమ (యొక్క);
కొలుకులు వదలించు = చిక్కులను తొలగించు;
ఘనునిఁ = (ఆ) భగవంతుని;
కొలిచెద మదిలోన్ = నా మనస్సులో సేవించెదను [లేదా ధ్యానించెదను].
సాధన
పలుకుల నగవుల నడపుల
నలుకల
నవలోకనముల నాభీరవధూ
కులముల
మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
palukula nagavula naDapula
nalukala
navalOkanamula nAbhIravadhU
kulamula
manamula tAlimi
kolukulu vadaliMcu ghanuni@M goliceda madilOn.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)