పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 82   Prev  /  Next

తామసగుణు లగు రాజులు
భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స
త్త్వామలతనుఁడై యీతఁడు
భామిని! వారల వధించుఁ బ్రతికల్పమునన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 238
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

यदा ह्यधर्मेण तमोधियो नृपा जीवंति तत्त्रैव हि सत्त्वतः किल​।
धत्ते भगं सत्यमृतं दयां यशो भवाय रूपाणि दधद्युगे युगे॥

యదా హ్యధర్మేణ తమోధియో నృపా జీవంతి తత్రైవ హి సత్త్వతః కిల।
ధత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దధద్యుగే యుగే ॥
వ్యాఖ్య
సాధన
తామసగుణు లగు రాజులు
భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ
త్త్వామలతనుఁడై యీతఁడు
భామిని!
వారల వధించుఁ బ్రతికల్పమునన్.
tAmasaguNu lagu rAjulu
bhUmiM brabhaviMci prajala@M boliyiMpa@Mga sa
ttvAmalanu@MDai yIta@MDu
bhAmini!
vArala vadhiMcu@M bratikalpamunana^.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)