పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 86   Prev  /  Next

(తరగతి క్రమము 58)
కాష్ఠంబు కంటె ధూమంబు
ధూమంబుకంటెఁ ద్రయీమయంబయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు
తమోగుణంబుకంటె రజోగుణంబు,
రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 61
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

पािथर वादारणो धूमसतसमादिगसयीमयः ।
तमसतु रजसतसमातसतवं यदबहदशर नम्॥

పార్థివద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః ।
తమసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనం ॥
వ్యాఖ్య
[భాగవత కథారంభములో సూతుడు శౌనకాది మునులతో ఇట్లు పలికెను:]

కాష్ఠంబు కంటె = మొద్దు కంటె;
ధూమంబు = పొగ;
ధూమంబుకంటెఁ = పొగ కంటె;
త్రయీమయంబయిన వహ్ని = మూడు వేదముల (ఋక్, యజుర్, సామ) కు సాధనభూతమయిన నిప్పు - లేదా సూర్యుని వలే తేజోమయమయిన నిప్పు;
యెట్లు విశేషంబగు = ఏ విధముగా మేలైనదో;
అట్లు = ఆ విధముగా;
తమోగుణంబుకంటె రజోగుణంబుఁ = తామస గుణము కంటె రాజసిక గుణము;
రజోగుణంబుకంటె = రాజసిక గుణము కంటె;
బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంభు = బ్రహ్మ జ్ఞానము ప్రకాశించు సాత్విక గుణము;
విశిష్టంబగుఁ = మేలయినది.
సాధన
కాష్ఠంబు కంటె ధూమంబు
ధూమంబుకంటెఁ ద్రయీమయంబయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు
తమోగుణంబుకంటె రజోగుణంబు,
రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు;
kAshThaMbu kaMTe dhUmaMbu
dhUmaMbukaMTe@M drayImayaMbayina vahni yeTlu viSEshaMbagu naTlu
tamOguNaMbukaMTe rajOguNaMbu,
rajOguNaMbukaMTe brahmaprakASakaMbagu sattvaguNambu viSishTaMbagu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)