పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 50   Prev  /  Next

(తరగతి క్రమము 113)
కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైర క్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైన ను
ద్దామ ధ్యానగరిష్ఠుఁడైన హరిఁ జెందన్‌వచ్చు ధాత్రీశ్వరా!
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 18
కామము, భయము, వైరము, ప్రేమ, భక్తి - ఈ భావములతో భగవంతునియందు మనసు లగ్నము చేసిన భగవంతుని చూడగలమని తెలుపుతూ, నారదుడు ధర్మరాజుతో ఈ విధముగా పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

गोप्यः कामाद्भयात्कंसो द्वेषाच्चैद्यादयो नृपाः ।
सम्बन्धाद् वृष्णयः स्नेहाद्यूयं भक्त्या वयं विभो ॥

గోప్యః కామాద్భయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః ।
సమ్బన్ధాద్ వృష్ణాయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో ॥
వ్యాఖ్య
కామము, భయము, వైరము, ప్రేమ, భక్తి - ఈ ఐదింటిలో ఏదో ఒక భావముతో భగవంతుడు ప్రధానంగా మనసు లగ్నము చేయుట ద్వారా భగవంతుని తెలిసికొనవచ్చునని నారదుడు ధర్మరాజుతో చెప్పిన మాటలివి. వీటిలో ఏదియు లేనటువంటి వేనుడు వంటి వారలు [7.19] ముక్తిని పొంద జాలరు.

కామోత్కంఠత గోపికల్ = కామ భావముతో గోపికలు;
భయమునం గంసుండు = భయ భావముతో కంసుడు;
వైర క్రియా సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ = ద్వేష భావముతో శిశుపాలకులవంటి రాజులు;
సంబంధులై వృష్ణులున్ = బంధుత్వము ద్వారా యాదవులు;
ప్రేమన్ మీరలు = ప్రేమ భావముతో మీరు [ధర్మరాజు వంటి రాజులు];
భక్తి నేము = భక్తి భావముతో మేము [నారదుడు వంటి వారలు];
ఇదె చక్రిం గంటిమి = ఈ మార్గములలో చక్రిని (భగవంతుని) చూచితిమి;
ఎట్లైన నుద్దామ ధ్యానగరిష్ఠుఁడైన = ఏదో ఒక భావముతో గాఢమైన ధ్యానములో పరిపూర్ణుడైన;
హరిఁ జెందన్‌వచ్చు = భగవంతుని చేరవచ్చును;
ధాత్రీశ్వరా = ఓ రాజా [ఓ ధర్మరాజా];
సాధన
కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైర క్రియా
సామగ్రిన్
శిశుపాలముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైన ను
ద్దామ ధ్యానగరిష్ఠుఁడైన
హరిఁ జెందన్‌వచ్చు ధాత్రీశ్వరా!
kAmOtkaMThata gOpikal bhayamunaM gaMsuMDu vaira kriyA
sAmagrin
SiSupAlamukhyanRpatul saMbaMdhulai vRshNulun
brEman mIralu bhakti nEmu nide cakriM gaMTi meTlaina nu
ddAma dhyAnagarishThu@MDaina
hari@M jeMdan^vaccu dhAtrISvarA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)