పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 4   Prev  /  Next

అమ్మలఁగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 10
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు దుర్గాదేవిని స్తుతించుచూ పోతనగారు చేసిన ప్రార్థన.
సాధన
అమ్మలఁగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ,
సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో
నమ్మిన
వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ,
కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌.
ammalaganna yamma, mugurammala mUlapuTamma, cAla pe
ddamma,
surArulamma kaDu pA~raDi vuccina yamma, dannu lO
nammina
vElpuTammala manammula nuMDeDe yamma, durga, mA
yamma,
kRpAbdhi yiccuta mahattva, kavitva paTutva saMpadal.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)