పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 108   Prev  /  Next

(తరగతి క్రమము 24)
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 140
శుకుడు భాగవతము చదివెననిన సందర్భమును ఆధారము చేసికొని, ఈ క్రింది శ్లోకములోని "మహదాఖ్యానాం" అను పదమును వివరించుటకై పోతనగారు చేసిన రచనయే ఈ పద్యమని చెప్పవచ్చును:

हरेर्गुणाक्षिप्तमतिर्भगवन् बादरायणिः।
अध्यगान्महदाख्यानां नित्यं विष्णुजनप्रियः॥

హరేర్గుణాక్షిప్తమతిర్భగవాన్ బాదరాయణిః ।
అధ్యగాన్మహదాఖ్యానాం నిత్యం విష్ణుజనప్రియః ॥

(ఈ పై శ్లోకమును పోతనగారు మొదటి స్కంధము లోని 139వ పద్యముగా అనువాదము గావించారు.)
వ్యాఖ్య
సూతుడు పలికెను:

నిగమములు = వేదములు;
వేయిఁ జదివిన = వేలకొలది చదివినను;
సుగమంబులు గావు = సులభతరము కావు;
ముక్తి సుభగత్వంబుల్ = మంగళకరమైన మోక్ష సాధనకు;
సుగమంబు = సులభము;
భాగవతమను నిగమంబు బఠింప = భాగవతము అను వేదమును చదివిన;
ముక్తి నివసనము = ముక్తి నివాసము;
బుధా! = ఓ విద్వాంసుడా (ఓ శౌనకా!).

వ్యాకుల చిత్తుడైన వ్యాసుని దగ్గరకు నారదముని వచ్చి భగవంతుని నామస్మరణమే ప్రధానముగా ఏ గ్రంథము వ్రాయనందులకు, మఱియు జుగుప్సాకరమైన కోరికల వెంట వెళ్ళు మానవులకు మరల కర్మఫలము ప్రధానముగా గల వేదములలోని ధర్మములను బోధించినందులకే ఆయన మనసుకు శాంతి కలుగలేదని చెప్పెను. ఇంకా తన పూర్వ జన్మ వృత్తాంతమును చెప్పి, యమ నియమములు ఎన్ని పాటించినను కామక్రోధాదులు ప్రేరేపింపబడునని, విష్ణు సేవ వలన క్రమముగా మనసుకు శాంతి కలుగునని చెప్పి సెలవు తీసుకొనెను.

నారదుడు వెళ్ళిన తరువాత వ్యాసుడు సరస్వతీ నదికి పడమటనున్న శమ్యాప్రాసము అను ఆశ్రమములో కూర్చుని భాగవతమును రచించి, తరువాత తన కుమారుడైన శుకునిచే చదివించెను - అని శౌనకుడు మొదలైన మునులకు సూతుడు చెప్పెను. ఇది విన్న శౌనకుడు మహాయోగియైన శుకుడు భాగవతమును చదువవలసిన అవసరము ఏమిటి అని ప్రశ్నించగా, సూతుడు కొంత వివరణ ఇచ్చెను. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు ఏ కారణము లేకుండగనే హరిభజనము చేయుదురని, నారాయణుడు అట్టివాడని చెప్పెను. హరి గుణ వర్ణన రతుడై భాగవతమును శుకుడు చదివెను అని చెప్పెను.
సాధన
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు
ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబుఁ బఠింప
ముక్తి నివసనము బుధా!
nigamamulu vEyu@M jadivina
sugamaMbulu gAvu
mukti subhagatvaMbul
sugamaMbu bhAgavatamanu
nigamaMbu@M baThiMpa
mukti nivasanamu budhA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)