పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 54   Prev  /  Next

(తరగతి క్రమము 79)
నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు
మదంబు దిగనాటి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి,
లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి,
యనంతనామంబులు పఠించుచుఁ,
బరమభద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు,
నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతః కరణంబులతోడ
విషయ విరక్తుండనై కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 129
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు [మొదటి శ్లోకములో రెండవ పాదం, రెండవ శ్లోకము, మూడవ శ్లోకములోని మొదటి పాదము లకు] పోతనగారు చేసిన తెలుగు అనువాదం.

एतावदुक्त्वोपरराम तन्महतद् भूतं नभो लिङ्गमलिङ्गमीश्वर्म् ।
अहं च तस्मै महतां महीयसे शीर्ष्णावनामं विदधेऽनुकंपितः ॥
नामान्यनन्तस्य हतत्रपः पटन् गुह्यानि बद्राणि च स्मरन् ।
गां पर्यटंस्तुष्टमना हतस्पृहः कालं प्रतीक्षन् विमदो विमत्सरः ॥
एवं कृष्णमतेर्ब्रह्मन्नासक्तस्यामलात्मनः ।
कालः प्रादुर्भूत्काले तडित्सौदामनी यथा ॥

ఏతావదుక్త్వోపరరామ తన్మహద్ భూతం నభో లిఙ్గమలిఙ్గమీశ్వరమ్ ।
అహం చ తస్మై మహతాం మహీయసే శీర్ష్ణావనామం విదధే నుకంపితః ॥
నామాన్యనంతస్య హతత్రపః పఠన్ గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్ ।
గాం పర్యటంస్తుష్టమనా గతస్పృహః కాలం ప్రతీక్షన్ విమదో విమత్సరః ॥
ఏవం కృష్ణమతేర్బ్రహ్మన్నాసక్తస్యామలాత్మనః ।
కాలః ప్రాదురభూత్కాలే తడిత్సౌదామనీ యథా ॥
వ్యాఖ్య
నారదముని వ్యాకులచిత్తుడైన వ్యాసునికడకు వచ్చి భాగవతమును వ్రాయమని ఉపదేశించి, తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తూ ఇట్లు చెప్పెను. తన పూర్వజన్మలో నారదుడు వేదవేత్తలకు సేవలుచేయుచూ జీవించెడి ఒక దాసీ పుత్రుని కుమారుడు [1.103]. ఆ సాధువులు బాలునిగా తను కూడా చేసిన సేవలకు మెచ్చి "ఈశ్వర రహస్యోదార విజ్ఞానము" ను [1.109] ఉపదేశించెను. తల్లి మరణించిన తరువాత "విష్ణుపదచింత యొనర్పఁగ" [1.119], పురములు, పట్టణంబులు, గ్రామంబులు, పల్లెలు దాటుకొని భయంకరారణ్యములగుండా ప్రయాణమును కొనసాగించెను [1.120-121]. ఒక రావి చెట్టు క్రింద కూర్చుని "పరమాత్మ స్వరూపు హరిం" చింతించెను [1.122]. అప్పుడు తన "తలఁపులో" భగవంతుదు సాక్షాత్కరించి అదృశ్యమయ్యెను [1.124]. లేచి "ఆతురుండునుంబోలె" (వ్యాధిగ్రస్తుని వలె) భగవంతునికొరకు వెదకుచున్న తనకు [1.124]: "కామ ముఖ షట్కము" పూర్తిగా నిర్మూలించుకొనలేని కుయోగులకు నేను కానరానని, నీ కోరిక కొనసాగుటకై క్షణకాలం నా స్వరూపాన్ని స్ఫురింపజేశానని [1.125] భగవంతుని వాణి వినిపించెను. అప్పుడు ఈ వచనములో చెప్పిన విధముగా నారదుడు చేసితినని చెప్పెను.
సాధన
నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు
మదంబు దిగనాటి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి,
లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి,
యనంతనామంబులు పఠించుచుఁ,
బరమభద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు,
నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతః కరణంబులతోడ
విషయ విరక్తుండనై కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండు;
nEnu mastakaMbu vaMci mrokki tatkaruNaku saMtasiMcucu
madaMbu diganATi, maccaraMbu viDici,kAmaMbu nirjiMci, krOdhaMbu varjiMci,
lObhamOhaMbula veDala naDici, siggu viDici,
yanaMtanAmaMbulu paThiMcucu@M,
baramabhadraMbu layina taccaritraMbulaM jiMtiMcucu,
niraMtara saMtushTuMDanai kRshNuni buddhi nilipi, nirmalAMta@H karaNaMbulatODa
vishaya viraktuMDanai kAlaMbuna keduru sUcucu bhUmiM dirugucu nuMDu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)