పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 93   Prev  /  Next

(తరగతి క్రమము 136)
హరిమయము విశ్వ మంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 17
ధారణ ఏ విధముగా చేయవలెనో బోధించి, విరాట్పురుషునిలో ఈ విశ్వమంతయు ఏ విధముగా పొదగబడి యుండెనో వివరించిన పిమ్మట శుకుడు పరీక్షితునితో ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यानसावीश्वरविग्रहस्य यः सन्निवेशः कथितो मया ते ।
सन्धार्यतेऽस्मिन् वपुशि स्थविष्ठे मनः स्वबुद्ध्या न यतोऽस्ति किञ्चित् ॥

ఇయానసావీశ్వరవిగ్రహస్య యః సన్నివేశః కథితో మయా తే |
సంధార్యతేऽస్మిన్ వపుషి స్థవిష్ఠే మనః స్వబుద్ధ్యా న యతోऽస్తి కిఞ్చిత్ ||
వ్యాఖ్య
హరిమయము విశ్వ మంతయు = ఈ విశ్వమంతయు భగవంతుడు నిండి యున్నాడు;
హరి విశ్వమయుండు = భగవంతునిలో ఈ విశ్వమంతయు ఇమిడి యున్నది;
సంశయము పనిలేదు = ఈ విషయములో ఎట్టి సందేహము వలదు;
ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు = ఆ భగవంతుడు లేని చోటు ఒక్క పరమాణువు కూడా లేదు;
వంశపావన వింటే = వంశమును పావనము చేసిన ఓ రాజా, వినుము.
సాధన
హరిమయము విశ్వ మంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలే దా
హరిమయము గాని
ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే
harimayamu viSva maMtayu
hari viSvamayuMDu saMSayamu panilE dA
harimayamu gAni
dravyamu
paramANuvu lEdu vaMSapAvana viMTE
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)