పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 156   Prev  /  Next

(తరగతి క్రమము 61)
వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి
ధర్మంబులు వాసుదేవ పరంబులు;
నిర్గుణుండయిన పరమేశ్వరుఁడు గలుగుచు లేకుండుచుఁ
ద్రిగుణంబులతోడం గూడిన తన మాయచేత
నింతయు సృజియించి గుణవంతుని చందంబున
నిజ మాయా విలసితంబు లయిన గుణంబులలోఁ
బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 61
ఈ వచనము ఈ క్రింది నాలుగు సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః ।
వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః ॥

వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః ।
వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః ॥

స యేవేదం ససర్జాగ్రే భగవానాత్మమయాయా ।
సదస్దౄపయా చాసౌ గుణమయ్యాగుణో విభుః ॥

తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ ।
అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభితః ॥
వ్యాఖ్య
భాగవత కథారంభములో సూతుడు ఈ విధముగా చెప్పెను.
సాధన
వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి
ధర్మంబులు
వాసుదేవ పరంబులు;
నిర్గుణుండయిన పరమేశ్వరుఁడు గలుగుచు లేకుండుచుఁ
ద్రిగుణంబులతోడం గూడిన తన మాయచేత
నింతయు సృజియించి గుణవంతుని చందంబున
నిజ మాయా విలసితంబు లయిన గుణంబులలోఁ
బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు;
vEda yAga yOga kriyA j~nAna tapOgati
dharmaMbulu
vAsudEva paraMbulu;
nirguNuMDayina paramESvaru@MDu galugucu lEkuMDucu@M
driguNaMbulatODaM gUDina tana mAyacEta
niMtayu sRjiyiMci guNavaMtuni caMdaMbuna
nija mAyA vilasitaMbu layina guNaMbulalO@M
bravESiMci vij~nAna vijRMbhituMDai veluMgu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)