పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 46   Prev  /  Next

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁ బోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 11
భాగవతమునకు ఉపోద్ఘాతములో పోతనగారు లక్ష్మీదేవిని ప్రార్థించుచూ వ్రాసిన పద్యము.
వ్యాఖ్య
సాధన
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు,
భారతీ గిరిసుతల్ తో నాడు పూఁ బోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు,
జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి,
సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
harikiM baTTapudEvi, punnemula prO, varthaMpu@M bennikka, caM
duru tO@MbuTTuvu,
bhAratI girisutal tO nADu pU@M bO@MDi, tA
maralaM duMDeDi muddarAlu,
jagamul manniMcu nillAlu, bhA
suratan lEmulu vApu talli,
siri yiccun nityakalyANamul.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)