పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 91   Prev  /  Next

(తరగతి క్రమము 135)
హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁబోవ నేర్చునె? వాఁడు సం
సరణముం బెడఁబాయఁడెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణమొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
ఛందస్సు (Meter): తరలము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 8
శుకుడు పరీక్షిత్తునకు యోగమార్గమును తెలుప నారంభించి ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము.

కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ ।
వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః ॥

किं प्रमत्तस्य बहुभिः परोक्षैर्हायनैरिह ।
वरं मुहूर्तं विदितं घटते श्रेयसे यतः ॥
వ్యాఖ్య
హరినెఱుంగక = భగవంతుని తెలిసికొనకుండగ;
యింటిలో = సంసారములో [అందలి ఆటు పోటులలో చిక్కుకొని];
బహుహాయనంబులు = అనేక సంవత్సరముల పాటు;
మత్తుఁడై పొరలుచుండెడి వెఱ్ఱి = [ఆ] మత్తులో పడిపోయి మతి భ్రమించినవాడు;
ముక్తికిఁబోవ నేర్చునె? = ముక్తి మార్గమున పయనించుటకు ఇష్టపడునా?
వాఁడు సంసరణముం బెడఁబాయఁడెన్నఁడు = అటువంటి వాడు [భ్రమను కలిగించే] సంసారమును ఎప్పుడూ విడనాడడు;
సత్య మా హరినామ సంస్మరణము = మనస్పూర్తిగా ఆ భగవంతుని నామ స్మరణమును;
ఒక్క ముహూర్తమాత్రము చాలు = ఒక్క ముహూర్తమంత (= 2 గడియలు = 48 నిమిషములు) సమయములో చేసినను;
ముక్తిదమౌ నృపా! = ముక్తి లభించును;
సాధన
హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁబోవ నేర్చునె? వాఁడు సం
సరణముం
బెడఁబాయఁడెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణమొక్క
ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
harine~ruMgaka yiMTilO bahuhAyanaMbulu mattu@MDai
poralucuMDeDi ve~r~ri muktiki@MbOva nErcune? vA@MDu saM
saraNamuM
beDa@MbAya@MDenna@MDu; satya mA harinAma saM
smaraNamokka
muhUrtamAtramu cAlu muktidamau nRpA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)