పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 141   Prev  /  Next

(తరగతి క్రమము 80)
సత్సంగంబువలన ముక్త దుస్సంగుండగు బుధుండు
సకృత్కాలసంకీర్త్యమానంబై రుచికరంబగు
నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం
డట్టి హరితోడి వియోగంబు సహింప [క...]
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 233
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

सत्सङ्गान्मुक्तदुःसङ्गो हातुं नोत्सहते बुधः ।
कीर्त्यमानं यशो यस्य सकृदाकर्ण्य रोचनम् ॥

సత్సంగాన్ముక్తదుస్సంగో హాతుం నోత్సహతే బుధః ।
కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్య రోచనం ॥
వ్యాఖ్య
"కృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయుటకును సుభద్రకుఁ బ్రియంబు సేయుకొఱకును గజ పురంబునం గొన్ని నెలలుండి,ద్వారకానగరంబు నకుం బ్రయాణంబు సేయందలంచి" అందిరినుండి వీడ్కోలుగొనుచున్న సందర్భములో "నిమిష మాత్రంబును హరికి నెడ లేని" (1.233) పాండవుల మనోభావములేవిధముగా నున్నవో సూతుడు తెలుపు చుండెను. "సత్సంగ"ము వలన ఏవిధముగా "దుస్సంగ"మునుండి ముక్తుడవునో బుద్ధిమంతుడు (wise man) రుచికరమైనట్టి భగవంతుని కీర్తనలను ఒక్కసారి విన్నా కూడా (ఆ స్మరణ ను) విడిచిపెట్టడు. మఱి పాండవులు హరియొక్క విరహమును ఏవిధముగా సహింపగలరు?
సాధన
సత్సంగంబువలన ముక్త దుస్సంగుండగు బుధుండు
సకృత్కాలసంకీర్త్యమానంబై రుచికరంబగు
నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం
డట్టి హరితోడి వియోగంబు సహింప [క...]
satsaMgaMbuvalana mukta dussaMguMDagu budhuMDu
sakRtkAlasaMkIrtyamAnaMbai rucikaraMbagu
nevvani yaSaMbu nAkarNiMci viDuva nOpaM
DaTTi haritODi viyOgaMbu sahiMpa [ka...]
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)