పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 39   Prev  /  Next

(తరగతి క్రమము 72)
దర్శనంబున జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన యీశ్వరునిదై క్రీడించుచు
నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై
యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు
జీవోపాధి యయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి
జీవుండు కాష్టంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం
దాన యుపరతుండయి బ్రహ్మ స్వరూపంబునం బొంది
పరమానందంబున విరాజమానుండగు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यद्येषोपरता देवी माया वैशारदी मतिः।
संपन्न एवेति विदुर्महिम्नि स्वे महीयते॥

యద్యేషోపరతా దేవీ మాయా వైశారదీ మతిః ।
సంపన్న ఏవేతి విదుర్మహిమ్ని స్వే మహీయతే ॥
వ్యాఖ్య
[సూతుడు ఈ విధముగా చెప్పెను:]

దర్శనంబున = [ఈ విధముగా] బ్రహ్మ దర్శనము నొందినపుడు;
జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన యీశ్వరునిదై క్రీడించుచు = జ్ఞానమే తనరూపమైన, నేర్పరియయిన ఈశ్వరునితో ఆడుకొనుచు;
అవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై = అజ్ఞానము అనబడు మాయనుండి విముక్తుడై;
ఎప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు = ఎప్పుడు జీవుడు జ్ఞానముచే పరిపాకమునొందునో అప్పుడు;
జీవోపాధి యయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి = జీవునికి ఉపాధి యయిన స్థూల రూపము, సూక్ష్మ రూపములు రెండు కాలి పోయి;
జీవుండు కాష్టంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం = జీవుడు పొగలేకుండగా మండుచున్న నిప్పువలె;
తాన యుపరతుండయి = పరిపక్వమునొంది;
బ్రహ్మ స్వరూపంబునం బొంది = బ్రహ్మ స్వరూపమును పొంది;
పరమానందంబున = అమితమయిన ఆనందముతో;
విరాజమానుండగు = ఎక్కువగా ప్రకాశించును.
సాధన
దర్శనంబున జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన యీశ్వరునిదై క్రీడించుచు
నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై
యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు
జీవోపాధి యయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి
జీవుండు కాష్టంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం
దాన యుపరతుండయి బ్రహ్మ స్వరూపంబునం బొంది
పరమానందంబున విరాజమానుండగు.
darSanaMbuna j~nAnaika svarUpaMbu viSAraduMDaina yISvarunidai krIDiMcucu
navidya yanaMbaDucunna mAya yuparatayai
yeppuDu dAna vidyArUpaMbunaM bariNata yagu nappuDu
jIvOpAdhi yayina sthUla sUkshma rUpaMbu dahiMci
jIvuMDu kAshTaMbu lEka tEjarillu vahni caMdaMbunaM
dAna yuparatuMDayi brahma svarUpaMbunaM boMdi
paramAnaMdaMbuna virAjamAnuMDagu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)