పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 49   Prev  /  Next

(తరగతి క్రమము 69)
గగనంబునందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును,
గాలియందుఁ బార్థివ ధూళి ధూసరత్వంబును నేరీతి నారీతి
ద్రష్టయగు నాత్మయందు దృశ్యత్వంబు
బుద్ధిమంతులు గాని వారిచేత నారోపింపంబడు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 67
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

यथा नभसि मेघौघो रेणुर्वा पार्थिवोऽनिले।
एवं द्रष्टरि दृश्यत्वमारोपितमबुद्धिभिः॥

యథా నభసి మేఘౌ ఘోరేణుర్వాపార్థివో నిలే।
ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపితమబుద్ధిభిః॥
వ్యాఖ్య
[సూతుడు భాగవతారంభములో శౌనకాది మునులకు ఈ విధముగా చెప్పెను:]

గగనంబునందుఁ = ఆకాశమునందు;
పవనాశ్రిత = గాలులవలన కూడుకొన్న;
మేఘ సమూహంబును = మబ్బుల గుంపులను [చూసి ఏవిధముగా మనము ఆకాశము మబ్బుగాయున్నదని ఆరోపణ చేస్తామో];
గాలియందుఁ = గాలిలో;
పార్థివ ధూళి = నేలనుండి రేగిన దుమ్ము;
ధూసరత్వంబును = పొగ మొదలయినవాని వలన కలిగిన కలుషితము ను [చూసి ఏవిధముగా గాలి కలుషితమయినదని ఆరోపించెదమో];
ఏరేతి - ఆరీతి = ఆ విధముగా;
ద్రష్టయగు - ఆత్మయందు = సాక్షిగా చూచుచున్న ఆత్మ;
దృశ్యత్వంబు = ఆకారము ధరించినది అని;
బుద్ధిమంతులు గాని వారిచేత - ఆరోపింపంబడు = అజ్ఞానమువలన ఆరోపించబడుచున్నది;
సాధన
గగనంబునందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును,
గాలియందుఁ బార్థివ ధూళి ధూసరత్వంబును నేరీతి నారీతి
ద్రష్టయగు నాత్మయందు దృశ్యత్వంబు
బుద్ధిమంతులు గాని వారిచేత నారోపింపంబడు.
gaganaMbunaMdu@M bavanASrita mEgha samUhaMbunu,
gAliyaMdu@M bArthiva dhULi dhUsaratvaMbunu nErIti nArIti
drashTayagu nAtmayaMdu dRSyatvaMbu
buddhimaMtulu gAni vAricEta nArOpiMpaMbaDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)