పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 116   Prev  /  Next

దేహాదులందు మోహజనకంబులగు నహంకార మమకారంబులు విడిచి
పసిండి గనులు గల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన
పాషాణాదులందుఁ బుటంబు పెట్టి వహ్ని యోగంబునఁ గరంగ
నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయుభంగి నాత్మకృత
కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన
యుపాయంబునం జేసి బ్రహ్మ భావంబుఁ బడయు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములలోని మొదటి శ్లోకమునందలి రెండవ పాదమునకు, రెండవ శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

एतैर्द्वादशभिर्विद्वानात्मनो लक्षणैः परैः ।
अहं ममेत्यसद्भावं देहादौ मोहजं त्यजेत् ॥
स्वर्ण यथा ग्रावसु हेमकारः क्षेत्रेषु योगैस्तदभिज्ञ आप्नुयात् ।
क्षेत्रेषु देहेषु तथात्मयोगैरध्यात्मविद् ब्रह्मगतिं लभेत् ॥

ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః ।
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్వజేత్ ॥
స్వర్ణ యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్ ।
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైరధ్యాత్మవిద్ బ్రహ్మగతిం లభేత్ ॥
వ్యాఖ్య
బంగారపు గని నుండి బంగారమును ఏవిధముగా నేర్పరితనముతో పొందవచ్చునో, ఈ దేహమునందు గల ఆత్మను కూడా నేర్పరితనముతో తెలిసికొనవలెనని నారదుడు చెప్పుచుండెను:

దేహాదులందు మోహజనకంబులగు = శరీరాదులందు మోహమును కలుగజేయు;
అహంకార మమకారంబులు విడిచి = నేను, నాది అను భావములను విడిచి;
పసిండి గనులు గల నెలవున = బంగారపు గనులుగల ప్రదేశమునుండి;
విభ్రాజమాన కనకలేశంబులైన = మెరిసిపోవు బంగారపు;
పాషాణాదులందుఁ బుటంబు పెట్టి = రాళ్ళు రప్పలను వేడి చేసి;
వహ్ని యోగంబునఁ గరంగ నూది = నిప్పు సహాయముతో కరిగేటట్లుగా ఊది;
హేమకారకుండు = బంగారమును వెలికితీయు వృత్తిలోనున్నవాడు;
పాటవంబున హాటకంబుఁ బడయుభంగి = నేర్పరితనముతో బంగారమును పొందు విధముగా;
ఆత్మకృత కార్య కారణంబుల నెఱింగెడి నేర్పరి = ఆత్మ యొక్క గుణగణములను తెలిసికొనిన నేర్పరి;
దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన = దేహమునందు ఆత్మను సిద్ధించుకొనుటకు;
ఉపాయంబునం జేసి = నేర్పరితనముతో;
బ్రహ్మ భావంబుఁ బడయు = బ్రహ్మత్వమును (ఆత్మ జ్ఞానమును) తెలిసికొనును.
సాధన
దేహాదులందు మోహజనకంబులగు నహంకార మమకారంబులు విడిచి
పసిండి గనులు గల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన
పాషాణాదులందుఁ బుటంబు పెట్టి వహ్ని యోగంబునఁ గరంగ
నూది
హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయుభంగి నాత్మకృత
కార్య
కారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన
యుపాయంబునం జేసి బ్రహ్మ భావంబుఁ బడయు.
dEhAdulaMdu mOhajanakaMbulagu nahaMkAra mamakAraMbulu viDici
pasiMDi ganulu gala nelavuna vibhrAjamAna kanakalESaMbulaina
pAshANAdulaMdu@M buTaMbu peTTi vahni yOgaMbuna@M garaMga
nUdi
hEmakArakuMDu pATavaMbuna hATakaMbu@M baDayubhaMgi nAtmakRta
kArya
kAraNaMbula ne~riMgeDi nErpari dEhaMbunaM dAtmasiddhiko~raku nayina
yupAyaMbunaM jEsi brahma bhAvaMbu@M baDayu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)