పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 130   Prev  /  Next

(తరగతి క్రమము 32)
పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ
పరుఁ డవ్యయుఁ డఖిలభూత బహిరంతర్భా
సురుఁడును లోక నియంతయుఁ
బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 186
కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తుతించుచూ ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

नमस्ये पुरुषं त्वाऽऽद्यमीश्वरं प्रकृतेः परम्।
अलक्ष्यं सर्वभूतानामन्तर्बहिरवस्थितम्॥

నమస్యే పురుషం త్వాऽऽద్యమీశ్వరం ప్రకృతేః పరం।
అలక్ష్యం సర్వభూతానామంతర్బహిరవస్థితం॥
వ్యాఖ్య
పురుషుండు = పరమాత్మయైన వాడు;
ఆఢ్యుఁడు = సంపన్నుడు;
ప్రకృతికిఁ పరుఁడు = ప్రకృతికి వేరైనవాడు;
అవ్యయుఁడు = నాశరహితుడు;
అఖిలభూత బహిరంతర్భాసురుఁడును = అన్ని భూతముల వెలుపల, లోపల యుండి ప్రకాశించువాడు;
లోక నియంతయు = లోకమును పరిపాలించువాడును;
పరమేశ్వరుఁడైన నీకు = ఆ విష్ణువుయైన నీకు;
ప్రణతులగు హరీ = నమస్కారములు ఓ హరీ!

భగవంతుడు ప్రకృతికి వేరైన వాడని (అనగా అవ్యక్తం), నాశరహితుడని (అనగా అక్షరం), అన్ని భూతములయందును వెలుగుచున్నవాడని (అనగా సర్వత్రగం) కుంతీదేవి వర్ణించెను. ఇటువంటి వర్ణన స్వయముగా శ్రీ కృష్ణ భగవానుడు తన నిజ స్వరూపమును గురించి భవద్గీతలోని పండ్రెండవ అధ్యాయము, మూడవ శ్లోకములో చెప్పెను. అచట భగవంతుడు (1) అక్షరం, (2) అనిర్దేశ్యం, (3) అవ్యక్తం, (4) సర్వత్రగం, (5) అచింత్యం, (6) కూటస్థం, (7) అచలం, (8) ధృవం - అని ఎనిమిది విధములుగా వర్ణించబడియుండెను:

యే త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే।
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధృవం॥ (భగవద్గీత, 12.3)
సాధన
పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ
పరుఁ
డవ్యయుఁ డఖిలభూత బహిరంతర్భా
సురుఁడును
లోక నియంతయుఁ
బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!
purushuM DADhyu@MDu prakRtiki@M
paru@M
Davyayu@M DakhilabhUta bahiraMtarbhA
suru@MDunu
lOka niyaMtayu@M
baramESvaru@MDaina nIku@M braNatulagu harI!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)