పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 124   Prev  /  Next

(తరగతి క్రమము 118)
పెక్కింటి కూటువ దేహ,
మదియు జంగమస్థావరరూపంబుల రెండు విధంబులయ్యె,
మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై,
మణిగణంబులం జొచ్చియున్న సూత్రంబు చందంబున
నాత్మ యిన్నింటియందునుం జొచ్చి దీపించు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

देहस्तु सर्वसंघातो जगत् तस्थुरिति द्विधा ।
अत्रैव मृग्यः पुरुषो नेति नेतीत्यतत् त्यजन् ॥

దేహస్తు సర్వసంఘాతో జగత్ తస్థురితి ద్విధా ।
అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్ త్యజన్ ॥
వ్యాఖ్య
సాధన
పెక్కింటి కూటువ దేహ,
మదియు జంగమస్థావరరూపంబుల రెండు విధంబులయ్యె,
మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై,
మణిగణంబులం జొచ్చియున్న సూత్రంబు చందంబున
నాత్మ యిన్నింటియందునుం జొచ్చి దీపించు.
pekkiMTi kUTuva dEha,
madiyu jaMgamasthAvararUpaMbula reMDu vidhaMbulayye,
mUlaprakRti modalayina vargaMbunaku vE~rai,
maNigaNaMbulaM jocciyunna sUtraMbu caMdaMbuna
nAtma yinniMTiyaMdunuM jocci dIpiMcu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)