పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 176   Prev  /  Next

(తరగతి క్రమము 78)
హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు
నన్యుని క్రియ సంసారంబునఁ జిక్కండు;
క్రమ్మఱ హరిచరణస్మరణంబుఁ జేయుచు
భక్తి రస వశీకృతుండయి విడువ నిచ్చగింపఁడు;
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 101
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

न वै जनो जातु कथंचनाव्रजेन्मुकुन्दसेव्यन्यवदङ्ग संसृतिम् ।
स्मरन्मुकुन्दाङ् घ्र्युपगूहनं पुनर्विहातुमिच्छेन्न रसग्रहो जनः ॥

న వై జనో జాతు కథంచనావ్రజేన్ముకుందసేవ్యన్యవదఙ్గ సంసృతిమ్ ।
స్మరన్ముకుందాఙ్ ఘ్ర్యుపగూహనం పునర్విహాతుమిచ్ఛేన్న రసగ్రహో జనః ॥
వ్యాఖ్య
నారదుడు వ్యాకులచిత్తుడైన వ్యాసునికడకు వచ్చి భాగవతమును వ్రాయమని ఉపదేశించిన సందర్భములో ఈ విధముగా పలికెను. "జుగుప్సితంబులగు కామ్యకర్మంబులు సేయుచు" జనులు "తత్త్వజ్ఞానంబు మఱతు"రని (1.98), "ఎఱిఁగెడు వాఁడు కర్మచయ మెల్లను" మానునని (1.99), భగవంతుని "సేవ బాసిన కులధర్మ గౌరవములు" ఎన్నడు సిద్ధి వహించవని (1.100) తెలిపి ఈ వచనములో చెప్పిన విధముగా బోధించెను.
సాధన
హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు
నన్యుని క్రియ సంసారంబునఁ జిక్కండు;
క్రమ్మఱ హరిచరణస్మరణంబుఁ జేయుచు
భక్తి రస వశీకృతుండయి విడువ నిచ్చగింపఁడు;
harisEvakuM DaguvA@MDu jananaMbu noMdiyu
nanyuni kriya saMsAraMbuna@M jikkaMDu;
kramma~ra haricaraNasmaraNaMbu@M jEyucu
bhakti rasa vaSIkRtuMDayi viDuva niccagiMpa@MDu;
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)