పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 79   Prev  /  Next

(తరగతి క్రమము 110)
కలుగును మఱి లేకుండును
గల భూతము లెల్లఁ గాలకర్మవశము లై
నిలఁబడుఁ బ్రకృతిం దద్గుణ
కలితుఁడుగాఁ డాత్మమయుఁ డగమ్యుఁడు దలఁపన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 50
తమ భర్త మరణమునకు శోకించుచున్న ఉశీనరదేశ రాణులను జూచి బలుని రూపమున నున్న యముడు యిట్లనెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

भूतानि तैस्तैर्निजयोनिकर्मभिर्भवन्ति काले न भवन्ति सर्वशः।
न तत्र हात्मा प्रकृतावपि स्थितस्तस्या गुणैरन्यतमो हि बध्यते॥

భూతాని తైస్తైర్నిజయోనికర్మభిర్భవన్తి కాలే న భవన్తి సర్వశః ।
న తత్ర హాత్మా ప్రకృతావపి స్థితస్తస్యా గుణైరన్యతమో హి బధ్యతే ॥
వ్యాఖ్య
కలుగును = [శరీరములు] కలుగుచుండును;
మఱి లేకుండును = [తదుపరి] నశించుచుండును;
కల భూతము లెల్లఁ = అన్ని భూతములును;
కాలకర్మవశము లై నిలఁబడుఁ = కాలానుగుణమున వారి వారి కర్మకు లోబడి ఉండును;
బ్రకృతిం = [కాని ఈ శరీరములలో పరమాత్మ ఉన్నప్పటికిని] ప్రకృతియందు;
తద్గుణ కలితుఁడుగాఁడు = దాని [త్రిగుణములతో కూడిన] గుణములు కలిగినవాడు కాదు;
ఆత్మమయుఁడు = ఆత్మ [స్వరూపమున నున్న ఆ పరమాత్మ];
అగమ్యుఁడు దలఁపన్ = ఆలోచింపగా [ఆ పరమాత్మ ఈ శరీరమున] బధ్యుడు కాడు;
సాధన
కలుగును మఱి లేకుండును
గల భూతము లెల్లఁ గాలకర్మవశము లై
నిలఁబడుఁ
బ్రకృతిం దద్గుణ
కలితుఁడుగాఁ డాత్మమయుఁ డగమ్యుఁడు దలఁపన్
kalugunu ma~ri lEkuMDunu
gala bhUtamu lella@M gAlakarmavaSamu lai
nila@MbaDu@M
brakRtiM dadguNa
kalitu@MDugA@M DAtmamayu@M Dagamyu@MDu dala@Mpan
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)