పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 22   Prev  /  Next

(తరగతి క్రమము 53)
తత్త్వజిజ్ఞాస యనునది ధర్మ జిజ్ఞాస యగుటఁ
గొందఱు ధర్మంబే తత్త్వంబని పలుకుదురు;
తత్త్వవిదులు జ్ఞానంబనుపేర నద్వయంబైన యది తత్త్వంబని యెఱుంగుదురు.
ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మమనియు,
హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు,
సాత్త్వతుల చేత భగవంతుం డనియును బలుకంబడు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 58
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము:

వదంతి తత్తత్వవిదస్తత్త్వం యజ్జ్ఞానమద్వయం ।
బ్రహ్మోతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే ॥
వ్యాఖ్య
[భాగవత కథారంభములో శౌనకాది ఋషులు అడిగిన ప్రశ్నకు సమాధానముగా సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: ఈది చాలా గొప్ప రహస్యము దాగియున్న వచనము. భగవంతుడు ఎచట ఉన్నాడో ఇక్కడ చెప్పబడినది.]

తత్త్వజిజ్ఞాస యనునది = భగవంతుని నిజస్వభావము తెలిసికొనగోరు కోరికయు (the desire to know the truth);
ధర్మ జిజ్ఞాస యగుటఁ = ధర్మ పరిపాలన యు ఒకటే యగుట వలన (is the same as the practice of dharma);
కొందఱు ధర్మంబే తత్త్వంబని పలుకుదురు = కొందరు ధర్మమే తత్త్వమని చెప్పుదురు;
తత్త్వవిదులు జ్ఞానంబనుపేర నద్వయంబైన యది తత్త్వంబని యెఱుంగుదురు = తత్త్వము తెలిసినవారలకు జ్ఞానము, తత్త్వము ఒకటేనని తెలియును;
ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మమనియు = ఆ తత్త్వమును ఉపనిషత్తులు చదివినవారు బ్రహ్మము అని పిలిచెదరు;
హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు = బ్రహ్మను ఆరాధించేవారు (లేదా యోగులు) పరమాత్మయని పిలిచెదరు;
సాత్త్వతుల చేత భగవంతుం డనియును బలుకంబడు = సాత్వతులు భగవంతుడు అని పిలిచెదరు.
సాధన
తత్త్వజిజ్ఞాస యనునది ధర్మ జిజ్ఞాస యగుటఁ
గొందఱు ధర్మంబే తత్త్వంబని పలుకుదురు;
తత్త్వవిదులు జ్ఞానంబనుపేర నద్వయంబైన యది తత్త్వంబని యెఱుంగుదురు.
ఆ తత్త్వంబు నౌపనిషదులచేత బ్రహ్మమనియు,
హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు,
సాత్త్వతుల చేత భగవంతుం డనియును బలుకంబడు.
tattvajij~nAsa yanunadi dharma jij~nAsa yaguTa@M
goMda~ru dharmaMbE tattvaMbani palukuduru;
tattvavidulu j~nAnaMbanupEra nadvayaMbaina yadi tattvaMbani ye~ruMguduru.
A tattvaMbu naupanishadulacEta brahmamaniyu,
hairaNyagarbhulacEtaM baramAtma yaniyu,
sAttvatula cEta bhagavaMtuM Daniyunu balukaMbaDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)