పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 148   Prev  /  Next

(తరగతి క్రమము 86)
తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీక్రియం బ్రజల ధన్యులఁ జేసిరి, వేల్పులైన నో
తండ్రి! భవన్ముఖాంబుజము ధన్యతఁ గానరు మావిధంబునన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 252
ఈ పద్యము ఈ క్రింది రెండు సంస్కృత శ్లోకములకు పోతనగారు చెసిన తెలుగు అనువాదుము:

भवाय नस्त्वं भव विश्वभावन त्वमेव माताथ सुहृत्पतिः पिता ।
त्वं सत्गुरुर्नः परमं च दैवतं यस्यानुवृत्त्या कृतिनो बभूविम ॥
अहो सनाथा भवता स्म यद्वयं त्रैविष्टपानामपि दूरदर्श्नम् ।
प्रेमस्मित स्निग्धनिरीक्षणाननं पश्येम रूपं तव सर्वसौभगम् ॥

భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా ।
త్వం సత్గురుర్నః పరమం చ దైవతం యస్యానువృత్త్యా కృతినో బభూవిమ ॥
అహో సనాథా భవతా స్మ యద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనమ్ ।
ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం పశ్యేమ రూపం తవ సర్వసౌభగమ్ ॥
వ్యాఖ్య
[యుద్ధానంతరము శ్రీకృష్ణడు హస్తినాపురమునుండి బయలుదేరి ద్వారకానగరమునకు వెళ్ళెను. ద్వారకానగర పౌరులు శ్రీకృష్ణునికి కానుకలనిచ్చి, ఈ విధముగా పలికిరి.] తండ్రులకు + ఎల్ల తండ్రియగు ధాతకు తండ్రివి = తండ్రులందరికి తండ్రియైన బ్రహ్మ దేవునికి తండ్రివి; దేవ నీవు = దేవా నీవు; మా తండ్రివి తల్లివి పతివి దైవమవున్ సఖివిన్ గురుండవు = మా తండ్రివి, తల్లివి, పతివి, దైవమునవు, సఖివి, గురుడవు [మా సర్వమూ నీవేనని భావము]; ఏ తండ్రులు నీక్రియం ప్రజల ధన్యులఁ జేసిరి = నీవు [నీ ప్రజలకు] చేసిన విధముగా ఎవరి తండ్రులు [వారి సంతానమును] ధన్యులను చేయలేదు; వేల్పులైన నో తండ్రి! = ఓ తండ్రీ! దేవతలు కూడా; భవన్ముఖాంబుజము = నీ ముఖ పద్మమును [చూచి]; ధన్యతఁ గానరు = ధన్యతను పొందలేరు; మావిధంబునన్ = మేము పొందినట్లుగా.
సాధన
తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి
దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీక్రియం
బ్రజల ధన్యులఁ జేసిరి, వేల్పులైన నో
తండ్రి!
భవన్ముఖాంబుజము ధన్యతఁ గానరు మావిధంబునన్.
taMDrula kella@M daMDriyagu dhAtaku@M daMDrivi dEva! nIvu mA
taMDrivi@M dalliviM bativi
daivamavuna^ sakhivina^ guruMDa; vE
taMDrulu nIkriyaM
brajala dhanyula@M jEsiri, vElpulaina nO
taMDri!
bhavanmukhAMbujamu dhanyata@M gAnaru mAvidhaMbunana^.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)