పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 2   Prev  /  Next

(తరగతి క్రమము 6)
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 2
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు శివుని స్మరించుచూ పోతనగారు చేసిన ప్రార్థన.

వాలిన భక్తి = తలవంచి భక్తి తో;
మ్రొక్కెద = నమస్కరించెదను;
అవారిత = వారింపలేని (అడ్డగింపలేని);
తాండవ = నాట్యము;
కేళికి = ఆట ఆడేవాడు;
శిఖరిజ = పర్వతుని కుమార్తె (పార్వతి);
ముఖపద్మ = పద్మము వంటి ముఖము (అనగా అందమైన ముఖము అని అర్ధము);
మయూఖ = కాంతి;
మాలి = కాపాడు వాడు (భర్త అని అర్ధము);
బాల శశాంక = నెల వంక;
మౌళి = కొప్పు;
కపాలి = పుఱ్ఱె (skull) ను ధరించిన వాడు;
మన్మథ గర్వ పర్వతోన్మూలికి = మన్మథుని గర్వాన్ని నిర్మూలించినవాడు;
నారదాది ముని ముఖ్య = నారదుడు మొదలైన ముఖ్యమైన మునుల;
మనః = మనస్సు అను;
ససరీరుహ = పద్మము;
ఆలి = తుమ్మెద;
(మనస్సరసీరుహాళికిన్ = మనస్సు అనే పద్మము పై తేనెకొరకు వాలే తుమ్మెద అని అర్ధము - అనగా నారదుడు మొదలైన మునులు ఆంటే ఇష్టమైన వాడు).
సాధన
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి
శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి
నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్.
vAlina bhakti mrokkeda navArita tAMDava kELikin dayA
SAliki
SUlikin SikharijA mukhapadma mayUkha mAlikin
bAla SaSAMka mauLiki@M gapAliki manmatha garva parvatO
nmUliki
nAradAdi muni mukhya manassarasIruhALikin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)