శ్రీశ్రీ 1910 జనవరి 2వ తేదీన "పూడిపెద్ది వెంకటరమణయ్య" గా అప్పలకొండ దంపతులకు (couple) జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తతు (adoption) స్వీకరించినందు వల్ల ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ఇరవయ్యవ శతాబ్దపు (20th century) తెలుగు సాహిత్యాన్ని (literature) శాసించిన (ruled) మహాకవి (great poet) శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన శ్రీశ్రీ అన్న పేరుతో ప్రసిద్ధి (well known) చెందారు.
శ్రీశ్రీ చాలా చిన్నవయసులోనే (childhood) తన రచనా వ్యాసాంగాన్ని (array of essays) మొదలు పెట్టారు. తన 18వ ఏట (age) "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించారు (published). తరువాతి కాలంలో సాంప్రదాయరచనా పద్ధతులైన (traditional methods) గ్రంధికశైలి (bookish style), చాందస్సు (meter), భావకిత్వ పద్యరచన వదలిపెట్టి వాడుక భాషలో (in colloquial language) మాత్రా చాందస్సులో కవిత్వం వ్రాయటం మొదలుపెట్టారు. తన రచనల మీద గురజాడ అప్పారావు గారి ప్రభావం (influence) ఉంది అని శ్రీశ్రీ తన ప్రసంగాల్లో (in his lectures) చెప్పేవారు.
శ్రీశ్రీ గారు వ్రాసిన కావ్యాలలో "మహాప్రస్థానం" అతి (more) ముఖ్యమైనది. ఈ కావ్యం శ్రీశ్రీని తెలుగు సాహిత్యంలో (in Telugu literture) అత్యున్నత (the most heighest) స్థానంలో నిలిపింది. ఇంతేకాక శ్రీశ్రీ "జ్వాలా తోరణం", "నవకవిత", "ప్రతిజ్ఞ", "శైశవగీతి" మొదలైన రచనలు అనేకం చేశారు. ఇంతేకాక శ్రీశ్రీ విప్లవ రచనలు, అభ్యుదయ రచనలు, సినిమా పాటలు కూడా చేశారు.
శ్రీశ్రీ కేంద్ర (central) సాహిత్య అకాడెమీ పురస్కారం (award) కూడ అందుకున్నారు. శ్రీశ్రీ తన ఆత్మకథను (autobiography) "అనంతం" అను పేరుతో వ్రాశారు.
శ్రీశ్రీ ప్రాసకు (rhyme), శ్లేష (sarcasm) కు పెట్టింది పేరు. అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీకి ఎవరూ సాటిరారు. శబ్ద ప్రయోగాలలో కొత్త దనాన్ని సృష్టించారు.